Maa Aawara Zindagi : 100% ఫన్ 0% లాజిక్.. బిగ్‌బాస్ శ్రీహన్ “మా ఆవారా జిందగీ”.. జూన్ 23న గ్రాండ్ రిలీజ్..

యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ మూవీ "మా ఆవారా జిందగీ" (జీరో% లాజిక్ 100% ఫన్) అనేది ట్యాగ్ లైన్. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా.....

Maa Aawara Zindagi : 100% ఫన్ 0% లాజిక్.. బిగ్‌బాస్ శ్రీహన్ “మా ఆవారా జిందగీ”.. జూన్ 23న గ్రాండ్ రిలీజ్..

BiggBoss Srihan Movie Maa Aawara Zindagi releasing on June 23rd

Updated On : June 22, 2023 / 1:24 PM IST

BiggBoss Srihan : బయటి లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నలుగురు అవరా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే “మా ఆవారా జిందగీ”.

బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ మూవీ “మా ఆవారా జిందగీ” (జీరో% లాజిక్ 100% ఫన్) అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా, ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. ఈ నెల 23న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమే “మా ఆవారా జిందగి”. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాము. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది అని అన్నారు.

Adipurush : విమర్శలు ఎన్ని వచ్చినా కలెక్షన్స్ మాత్రం అదుర్స్.. ఆదిపురుష్ @ 410 కోట్లు..

బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేసే అవకాశం రావడం చాలా కష్టం. చిన్న సినిమాలలో నటించి మంచి నటుడుగా నిరూపించుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ సినిమాలోని మా నటనకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్ అవుతారని కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.

 

BiggBoss Srihan Movie Maa Aawara Zindagi releasing on June 23rd