Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్

బిందు మాధవి బిగ్‌బాస్ లో పాల్గొని తెలుగు బిగ్‌బాస్ లో మొదటి మహిళా విజేతగా నిలిచింది. ఈ షోతో ఆమెకు మళ్ళీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విజయంతో బిందు మాధవికి గతంలో లాగా మళ్ళీ ఛాన్సులు వస్తాయని................

Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్

Balayya

Bindu Madhavi :  ఇటీవల జరిగిన బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో విజేతగా నిలిచింది బిందు మాధవి. గతంలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అవకాశాలు లేకపోవడంతో కొన్ని రోజుల నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బిందు మాధవి బిగ్‌బాస్ లో పాల్గొని తెలుగు బిగ్‌బాస్ లో మొదటి మహిళా విజేతగా నిలిచింది. ఈ షోతో ఆమెకు మళ్ళీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విజయంతో బిందు మాధవికి గతంలో లాగా మళ్ళీ ఛాన్సులు వస్తాయని ఆశిస్తుంది. అయితే ఇప్పటికే ఓ సినిమా ఫిక్స్ అయిపొయింది బిందుమాధవికి. అది కూడా బాలయ్య బాబు సినిమా కావడం విశేషం.

Dhanush : ఈ ఆరోపణలు ఆపకపోతే 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను.. ధనుష్ వార్నింగ్..

ఇటీవల జరిగిన బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి పలువురు సెలబ్రిటీలు వచ్చి కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. షోలో వచ్చిన అనిల్ రావిపూడి తన F3 సినిమా ప్రమోషన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ తో మాట్లాడాడు. ఇందులో భాగంగా బిందు మాధవికి తన నెక్స్ట్ సినిమా, బాలకృష్ణతో చేయబోయే సినిమాలో కచ్చితంగా క్యారెక్టర్ ఇస్తానని తెలిపాడు. మాటిస్తున్నాను.. కచ్చితంగా బాలయ్య బాబు సినిమాలో బిందు మాధవికి ఒక క్యారెక్టర్ ఇస్తాను అని అనిల్ రావిపూడి స్టేజి మీదే చెప్పాడు. దీంతో బిందు మాధవికి మళ్ళీ పాత రోజులు రానున్నాయి అంటున్నారు. మరి అనిల్ బిందుకి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తాడో చూడాలి.