బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పసిబిడ్డతో ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలింత

బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పసిబిడ్డతో ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలింత

Bihar : చదువుమీదున్న ప్రేమతో ఇలా బిడ్డకు జన్మనిచ్చి అలా ఇంటర్ పరీక్షలు రాయటానికి వెళ్లిందో బాలింత మహిళ. బీహార్‌లోని సారణ్ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం (జనవరి2) ఉదయం 6 గంటలకు బిడ్డను ప్రసవించింది. అనంతరం నారాయణ పూర్ గ్రామానికి చెందిన మాలిక్ రాయ్ అనే యవకుడి భార్య కుసుమ్ కుమారి ఇంటర్ పరీక్ష రాయటానికి వెళ్లింది. ఇంటర్ పరీక్షలు మొదలైన రెండవ రోజున కుసుమ్ కు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. గా కుసుమ్ పండంటి బిడ్డను జన్మనిచ్చింది. ఆ వెంటనే పరీక్ష రాయటానికి వెళ్లింది.

అక్కడ తెల్లవారుజామను ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. పండంటి బిడ్డను జన్మనిచ్చింది. డెలివరీ అయిన ఆరు గంటల తరువాత కుసుమ్ కుమారి ఉదయం 10 గంటలకు గాంధీ హైస్కూల్‌లోని పరీక్షా కేంద్రానికి ఇంటర్ పరీక్ష రాయటానికి చంటిబిడ్డతో సహా హాజరైంది. ఆమెకు ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినప్పటికీ పరీక్షకు హాజరై ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె వెంటనే ఆమె తల్లి తోడుగా రాగా బిడ్డకు పాలు ఇచ్చి కుసుమ్ పరీక్ష రాటానికి వెళ్లింది.

కాగా..పరీక్షల భయంతోను టెన్షన్ తోను.. పలు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు. కాగా బీహార్ లో ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి.