Sushant Singh relatives Dead : రోడ్డు ప్రమాదంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య ఎంతటి విషాదాన్ని కలిగించిదో చెప్పనక్కరలేదు. ఈక్రమంలో సుశాంత్ కుటంబానికి చెందిన ఆరుగురు బంధువులు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Sushant Singh relatives Dead : రోడ్డు ప్రమాదంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Accident.. 6 Relatives Of Sushant Singh

accident.. 6 relatives of Sushant Singh : బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య విషాదం నుంచి ఇంకా ఆ కుటుంబం పూర్తిగా కోలుకోనేలేదు. అయినా వారి కుటుంబాన్ని విషాదాలు వెన్నంటుతున్నాయి. సుశాంత్ మృతి ఓ సంచలనంగా మారింది. డ్రగ్స్ కేసు కదిలింది. సుశాంత్ మరణం బాలివుడే కాదు అన్ని సినిమా పరిశ్రమలు షాక్ అయ్యాయి. ఈ డ్రగ్ కేసు ఇంకా హాట్ హాట్ గా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో మరో సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం (నవంబర్ 16,2021) తెల్లవారుజామున సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బీహార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ సింగ్… సుశాంత్ సింగ్ కు బంధువే. ఓం ప్రకాశ్ సింగ్ సోదరి మృతి చెందగా, బీహార్ లోని లఖిసరాయ్ లో ఆమె అంత్యక్రియలకు సుశాంత్ కుటుంబానికి చెందినవారు కూడా హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక అన్ని కార్యక్రమాలు ముగించుకని తిరిగి వారు పాట్నా వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో వారి ప్రయాణిస్తున్న సుమో వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

సుశాంత్ సింగ్ బంధువులు ప్రయాణిస్తున్న సుమో వాహనం లఖిసరాయ్ జిల్లా సికంద్రా-షేక్‌పురా NH-333లోని హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా గ్రామ సమీపంలో ఓ గ్యాస్ లోడ్ ట్రక్కును బలంగా ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో సుశాంత్ బావ, మేనల్లుడుతోపాటు ఇతర బంధువులు కూడా ఉన్నారు. వారి వాహనంలో 10మంది ఉన్నట్లుగా సమాచారం.ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా..మిగిలిన నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని జాముయిలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఒకరైన లాల్‌జిత్ సింగ్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి అత్యంత సమీప బంధువు. సుశాంత్ బావ ఓంప్రకాష్ సింగ్ హర్యానాలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఓంప్రకాష్‌ సింగ్‌ సోదరి గీతాదేవికి అంత్యక్రియలు చేసిన తర్వాత వారంతా పాట్నా నుంచి జామున తమ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదం జరగడంతో కుటుంబంలో మరింత విషాదం నిండుకుంది. ఇదంతా చూస్తుంటే సుశాంత్ కుటుంబాన్ని మృత్యువు వెన్నాడుతున్నట్లుగా ఉంది అనిపిస్తోదంటున్నారు ఈ ప్రమాదం గురించి తెలిసినవారు.