Door-To-Door Vaccination : బికనెర్‌లో ఇంటింటికి వ్యాక్సిన్.. దేశంలోనే ఫస్ట్ సిటీ..!

రాష్ట్రంలోని బికనెర్ సిటీ మరింత వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం చేసింది. డోర్ -టు-డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. దాంతో దేశంలోనే ఈ తరహా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించే మొట్టమొదటి సిటీగా అవతరించనుంది.

Door-To-Door Vaccination : బికనెర్‌లో ఇంటింటికి వ్యాక్సిన్.. దేశంలోనే ఫస్ట్ సిటీ..!

Bikaner To Be First City In Country To Start Door To Door Vaccination

Door-To-Door Vaccination in Bikaner : దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాజస్థాన్ ఒక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని బికనెర్ సిటీ మరింత వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం చేసింది. డోర్ -టు-డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. దాంతో దేశంలోనే ఈ తరహా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించే మొట్టమొదటి సిటీగా అవతరించనుంది. సోమవారం (జూన్ 14) నుంచి ఈ డోర్-టు-డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 45ఏళ్లు పైబడిన వారికి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ అందించనున్నారు అధికారులు.

ఇందులో భాగంగా రెండు అంబులెన్సులు, ముగ్గురు మొబైల్ టీమ్‌లతో కలిసి ఇంటింటికి వెళ్లి టీకాలను వేయనున్నారు. దీనికి వాట్సాప్ నెంబర్ ద్వారా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకునేవారు ముందుగా వాట్సాప్ నెంబర్ ద్వారా తమ పేపు, అడ్రస్ తో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం 10 మంది రిజిస్టర్ చేయించుకుంటేనే వారి ఇళ్లకు నేరుగా అంబులెన్స్ బయల్దేరి వెళ్తుంది. టీకా వృథా కాకుండా ఉండేందుకు వీలుగా కనీసంగా 10 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే పది వరకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

ముందుగా ఒక ఇంటికి అంబులెన్స్ వెళ్లి ఆ ఇంట్లో రిజిస్టర్ చేయించుకున్న వారికి టీకా ఇస్తుంది. ఆ తర్వాత మరో ఇంటికి వెళ్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో టీకా సంబంధిత దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఒక వైద్య బృందం అక్కడే ఉంటుంది. రాష్ట్ర రాజధాని జైపూర్ కు 340 కిలోమీటర్ల దూరంలో బికనెర్ సిటీ ఉంది. ఇక్కడ 16 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు డాక్టర్లు ఉన్నారు. టీకా తీసుకున్న వారిలో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తిన ఈ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తుంటుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం 7 లక్షల మంది ఉన్న బికనెర్ సిటీలో ఇప్పటివరకూ 60 నుంచి 65 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించినట్టు ఆ జిల్లా కలెక్టర్ నమిత్ మెహతా వెల్లడించారు. ఇప్పటివరకూ బికనెర్ సిటీలో 3,69వేల మందికి వ్యాక్సిన్ అందింది. గత 24 గంటల్లో ఈ జిల్లాలో 28 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఈ జిల్లాలో 40,118 కేసులు నమోదు కాగా.. 527 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం 453 యాక్టివ్ కేసులు ఉన్నాయి.