Priyanka Gandhi : ‘పరీక్షా పేపర్ లీక్’పై చర్చ పెట్టండి.. బీజేపీ సర్కార్‌పై ప్రియాంకా గాంధీ ఫైర్
Priyanka Gandhi : యూపీలో జరిగిన 12వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bjp Government Should Hold Charcha On Paper Leak In Up Priyanka Gandhi
Priyanka Gandhi : యూపీలో జరిగిన 12వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పరీక్షా పే’ చర్చ మాదిరిగా పరీక్షా పేపర్ లీక్ అంశంపైనా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్‌లో యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే.
దీని కారణంగా లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని ప్రియాంకా గుర్తు చేశారు. గతంలో పేపర్ లీక్ ఘటన మరువకముందే.. రాష్ట్రంలో మరోసారి పేపర్ లీక్ ఘటన వెలుగు చూసిందని ఆమె విమర్శించారు. పేపర్ లీక్ వార్త రాసిన వారిని జైలుకు పంపుతున్నారని ప్రియాంకా మండిపడ్డారు. ఈ అంశాన్ని బుల్డోజర్లు టార్గెట్ చేయకలేకపోతోందని విమర్శించారు.
యూపీలో జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
యూపీలో 24 జిల్లాల్లో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను వీలైనంత త్వరగా వెల్లడిస్తామని తెలిపారు. పేపర్ లీక్‌పై పూర్తి వివరాలు తెలుసుకున్నాకే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి యూపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Priyanka Chopra : రెండున్నర కోట్లకు తన కార్ని అమ్మేసిన ప్రియాంక చోప్రా