congress: కాంగ్రెస్ కంటే బీజేపీకి 6.4 రెట్లు అధికంగా విరాళాలు

దేశంలో ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు స‌మ‌కూరిన నిధుల వివ‌రాలను ఎన్నిక‌ల సంఘం ఓ నివేదిక ద్వారా వెల్ల‌డించింది.

congress: కాంగ్రెస్ కంటే బీజేపీకి 6.4 రెట్లు అధికంగా విరాళాలు

Congbjp

congress: దేశంలో ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు స‌మ‌కూరిన నిధుల వివ‌రాలను ఎన్నిక‌ల సంఘం ఓ నివేదిక ద్వారా వెల్ల‌డించింది. ఆ వివ‌రాల ప్ర‌కారం.. బీజేపీకి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం క‌లిపి రూ.477.5 కోట్ల‌కు పైగా నిధులు విరాళాల రూపంలో వ‌చ్చాయి. అదే ఆర్థిక సంవ‌త్స‌రంలో కాంగ్రెస్‌ రూ.74.50 కోట్ల నిధులు విరాళాల ద్వారా అందుకుంది.

China: తైవాన్ గ‌గ‌న‌త‌లానికి ఒకేసారి 30 యుద్ధ విమానాలను పంపిన చైనా

అంటే, బీజేపీకి వ‌చ్చిన నిధులతో పోల్చితే.. ఆ పార్టీకి వ‌చ్చిన విరాళాల్లో కాంగ్రెస్‌కి కేవ‌లం 15 శాతం మాత్ర‌మే వ‌చ్చాయి. కాంగ్రెస్‌కి వ‌చ్చిన విరాళాల కంటే బీజేపీకి వ‌చ్చిన విరాళాలు 6.4 రెట్లు ఎక్కువ‌. వ్య‌క్తిగ‌తంగా ప్ర‌ముఖులు, ఆయా పార్టీల అభిమానులతో పాటు సంస్థ‌లు, ఎల‌క్టోర‌ల్ ట్ర‌స్టుల నుంచి ఈ విరాళాలు అందుతాయి. ఆ వివ‌రాల‌ను ఈ ఏడాది మార్చి 14కి ముందు ఎన్నిక‌ల సంఘానికి పార్టీలు స‌మ‌ర్పించాయి. కాగా, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం కంటే బీజేపీకి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన విరాళాలు త‌గ్గాయి. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీజేపీకి రూ.785.77 కోట్ల విరాళాలు వ‌చ్చాయి. కాగా, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 20 వేల రూపాయ‌ల‌ కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన వారి వివ‌రాల‌ను రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ప్రతి ఏడాది తెలియ‌జేయాల్సి ఉంటుంది.