BJP: ఏడాదికి రూ.720 కోట్లు.. అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ!

విరాళాలు అందుకోవడంలో టాప్ పొజిషన్లో ఉంది భారతీయ జనతా పార్టీ. 2019-20కు గానూ జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల గురించి..

BJP: ఏడాదికి రూ.720 కోట్లు.. అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ!

Bjp

BJP: విరాళాలు అందుకోవడంలో టాప్ పొజిషన్లో ఉంది భారతీయ జనతా పార్టీ. 2019-20కు గానూ జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల గురించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వివరాలను వెళ్లడించింది. అత్యధిక విరాళాలను అందుకోవడం ద్వారా టాప్ ప్లేస్‌లో ఉంది భారతీయ జనతా పార్టీ. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలను లెక్కించి ఏడీఆర్ ప్రకటించింది. ఇందులో బీజేపీ అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా మరోసారి రికార్డు కెక్కింది.

Rajya Sabha BJP : రాజ్యసభలో బీజేపీ కొత్త చరిత్ర.. 100 దాటిన సభ్యుల సంఖ్య

బీజేపీ ఏకంగా రూ.720 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ఏడీఆర్ పేర్కొంది. ఈ విషయంలో రెండో స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి రూ.133 కోట్ల రూపాయల వరకూ విరాళాలు వచ్చాయని ఏడీఆర్ ప్రకటించగా.. ఆ తరువాత ఎన్సీపీ రూ.57 కోట్ల విరాళాలు అందుకుంది. కాగా అత్యధిక విరాళాలు ఇచ్చిన కంపెనీగా ఫ్రడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నిలిచింది. ఈ సంస్థ బీజేపీ, కాంగ్రెస్ కు కలిపి రూ.247 కోట్లు విరాళాలు అందించింది.

BJP Foundation day: బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న మోదీ

గతంలో 2016-17‌కు గానూ బీజేపీ రూ.532 కోట్లు దక్కించుకోగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు 2019-20 ఏడాదిలో స్వల్పంగా తగ్గి రూ.720 కోట్ల విరాళాలు అందాయి. మొత్తంగా చూస్తే ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీల వరకు ఈ విరాళాలు భారీగానే అందుతున్నట్లు కనిపిస్తుంది.