Bandi Sanjay : కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే : బండి సంజయ్

తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని చెప్పారు.

Bandi Sanjay : కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే : బండి సంజయ్

Bandi Sanjay (1)

Bandi Sanjay : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే అంటూ విమర్శించారు. వారంలో ఇస్తానన్న పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయన్నారు. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నవా? అని నిలదీశారు.

నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా అని అన్నారు. ఆ కేంద్రాలు తెరవకపోవడం వల్లే చాలా మంది రైతులు కోతలను నిలిపివేశారని పేర్కొన్నారు. కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. నీ సమగ్ర పంటల బీమా విధానం ఏమైందని నిలదీశారు.

Bandi Sanjay : తెలంగాణలో శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితి వస్తుంది : బండి సంజయ్

ఫసల్ బీమా పరిహారం అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదు కదా? అన్నారు. నీ వల్ల రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవాలా? అని నిలదీశారు. నీ కొడుకు, బిడ్డ సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు సాయం అందేది కదా? అని చెప్పారు. పంజాబ్ రైతులకిచ్చిన చెక్కులు చెల్లలేదన్నారు. తెలంగాణ రైతుల వద్ద కూడా అన్నీ కోతలేనా? అని వెల్లడించారు.

కనీస మద్దతు ధరకు తోడుగా ఏనాడైనా వరికి రూ.500 బోనస్ ఇచ్చినావా? అని అన్నారు. పండించిన ధాన్యం నేనే కొంటానంటవ్? కొనుగోలు కేంద్రాలు ప్రారంభించవు? అంటూ నిలదీశారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని చెప్పారు.