BMW Scooter: ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసింది BMW. బీఎండబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియా డీలర్ షిప్స్ వద్ద ఈ BMW C 400 GTను కొనుగోలు చేయొచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది.

BMW Scooter: ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

Bmw Scooter

BMW Scooter: ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసింది BMW. బీఎండబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియా డీలర్ షిప్స్ వద్ద ఈ BMW C 400 GTను కొనుగోలు చేయొచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ మిడ్ సైజ్ ప్రీమియం స్కూటర్ డిజైనింగ్ ను అద్భుతమైన కంఫర్ట్, డైనమిక్ పర్‌ఫార్మెన్స్, టూరింగ్ కెపబిలిటీ విస్తరణ లాంటి పరిగణనలోకి తీసుకుని రూపొందించారు.

ఆల్పిన్ వైట్ కలర్ షేడ్ ఎక్స్‌షోరూం ధర రూ.9.95లక్షలుగా ఉండగా.. ట్రిపుల్ బ్లాక్ కలర్ షేడ్ ఎక్స్‌షోరూం ధర రూ.10.15లక్షలుగా వరకూ పలుకుతుంది.

బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలోని సిటీల్లో BMW C 400 GT స్కూటర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. లాంగ్ టూరింగ్ డెస్టినేషన్స్ వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఛాయీస్. సిటీ సెంటర్లో, ఆఫీసులకు వెళ్లడానికి, వీకెండ్ టూర్ ఎంజాయ్ చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. పరిపూర్ణమైన రైడ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ ఛాయీస్. ఒంటరిగా వెళ్లడానికే కాదు పార్టనర్ తో వెళ్లడానికి కూడా కరెక్ట్ ఎంపిక’ అని అన్నారు.

……………………………………………. : విద్యుత్ సంక్షోభానికి కేంద్రమే కారణం, తెలంగాణకు ఇబ్బంది లేదు

350సీసీతో వస్తున్న BMW C 400 GT సింగిల్ సిలిండర్ తో వస్తుంది. వాటర్ కూల్‌డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ తో వస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగం 9.5 సెకన్లలో పికప్ చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 139 కిలోమీటర్లు. BMW C 400 GT నేరుగా ఇంటిగ్రేటెడ్ CVT గేర్‌బాక్స్ అలాగే సెకండరీ డ్రైవ్‌ను డ్రైవ్‌ట్రెయిన్ స్వింగార్మ్ రూపంలో ఉపయోగిస్తుంది. కౌంటర్ బ్యాలెన్స్ షాఫ్ట్ ఆపరేషన్ సమయంలో ఇంజిన్ శుద్ధీకరణను నిర్ధారిస్తుంది.

ఏరోడైనమిక్‌గా ట్విన్ LED హెడ్‌లైట్‌తో రూపొందించబడింది. ఇది LED డేటైమ్ రన్నింగ్ లైట్ యొక్క విలక్షణమైన డిజైన్‌తో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ప్రత్యేకమైనవి. హై విండ్‌షీల్డ్ హైవేపై ఎక్కువ గంటలు గాలి, వాతావరణ రక్షణను అందిస్తుంది. సి 400 జిటి 6.5-అంగుళాల పూర్తి-రంగు టిఎఫ్‌టి స్క్రీన్‌తో వస్తుంది, ఇది బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ కనెక్టివిటీ యాప్‌తో సహా కనెక్టివిటీ ఫంక్షన్లను అందిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ సి 400 జిటిని మరింత అనుకూలీకరించడానికి కస్టమర్‌లు సమగ్ర శ్రేణి ఒరిజినల్ బిఎమ్‌డబ్ల్యూ ఉపకరణాలను కూడా ఎంచుకోవచ్చు.