Power Crisis : విద్యుత్ సంక్షోభానికి కేంద్రమే కారణం, తెలంగాణకు ఇబ్బంది లేదు

దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.

Power Crisis : విద్యుత్ సంక్షోభానికి కేంద్రమే కారణం, తెలంగాణకు ఇబ్బంది లేదు

Telangana Power Crisis

Power Crisis : దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం భయాందోళనలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. గత ఏడాది పీక్ డిమాండ్ లోనూ ఇబ్బంది తలెత్తలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, దార్శనికతతోనే విద్యుత్ విషయంలో ముందున్నాం అని మంత్రి చెప్పారు. కేసీఆర్ ముందు చూపుతోనే బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రస్తుత సంక్షోభంలో తెలంగాణపై ఎటువంటి ప్రభావం లేదన్న మంత్రి జగదీశ్ రెడ్డి, భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

Prakash Raj : భోరున ఏడ్చిన బెనర్జీ.. మా అమ్మను తిట్టారంటూ తనీష్ భావోద్వేగం..

దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది. విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు.

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గరున్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలని తెలిపింది. అలాగే, మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు కరెంట్ సాయం చేయాలని కోరింది.