Parineeti Chopra : వాళ్ళని చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది.. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి..
ఇటీవల బాలీవుడ్ లో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఓ బాలీవుడ్ హీరోయిన్ వీళ్ళ పెళ్లిళ్లు చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంది.

Bollywood heroine parineeti chopra wants to marry and said search a good person for her
Parineeti Chopra : ఇటీవల బాలీవుడ్ లో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది విక్కీ కౌశల్-కత్రీనా, అలియా-రణబీర్, ఇటీవల అతియాశెట్టి-KL రాహుల్, సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ.. ఇలా వరుసగా పలువురు సెలబ్రిటీలు పెళ్లి బాట పట్టారు. దీంతో ఓ బాలీవుడ్ హీరోయిన్ వీళ్ళ పెళ్లిళ్లు చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటుంది.
పలు సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో ఓ పదేళ్ల నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది పరిణీతి చోప్రా. ఇప్పుడు కూడా పరిణీతి చేతిలో ఓ మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ 34 ఏళ్ళ భామ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి వ్యాఖ్యలు చేసింది.
Tamannaah love story : తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ నిజమేనా?? విజయ్ వర్మ తమన్నాని ఇలా పిలుస్తాడా?
పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సింగిల్. కాని ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్లు, ఆ ఫోటోలు చూసి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. వాళ్లంతా నా స్నేహితులు. వాళ్ళు అలా పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా కాలం ప్రేమలో ఉండి ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నేను ఎవ్వరితో ప్రేమలో లేను. నేను ఎవరితో అయినా ప్రేమలో పడినప్పుడు అతనిని పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీనే. కాని మంచి అబ్బాయి లేడు. పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలు చేస్తాను. కెరీర్, ఫ్యామిలీ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటాను, ఎవరన్నా మంచి అబ్బాయి ఉంటే రికమండ్ చేయండి అని తెలిపింది. దీంతి పరిణీతి చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా సోషల్ మీడియాలో మమల్ని చేసుకో అంటూ బోల్డన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి పరిణీతికి. మరి ఈ పంజాబీ భామ ఎవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి.