Allu Arjun: త్వరలో బన్నీతో భేటీ కానున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎందుకో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-ది రైజ్’ చిత్రాన్ని రష్యాలో రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప టీమ్ రష్యాలో పర్యటిస్తోంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ చూపును కూడా తనవైపుకు తిప్పుకున్న బన్నీతో పలువురు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Allu Arjun: త్వరలో బన్నీతో భేటీ కానున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఎందుకో?

Bollywood Star Director Rohit Shetty To Meet Allu Arjun Soon

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-ది రైజ్’ చిత్రాన్ని రష్యాలో రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప టీమ్ రష్యాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో రష్యాలో బన్నీ చేస్తున్న హల్‌చల్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను రష్యాలో రిలీజ్ చేసిన తరువాత బన్నీ తిరిగి ఇండియాకి రాగానే, ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Allu Arjun : రష్యాలో పుష్ప..? రష్యాకి చెక్కేస్తున్న బన్నీ??

కాగా, బన్నీ స్టార్‌డమ్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఒక్కసారిగా టాప్‌కు చేరుకుంది. పుష్ప సినిమాకు బాలీవుడ్‌లోనూ మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అక్కడి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప సినిమాతో బాలీవుడ్ చూపును కూడా తనవైపుకు తిప్పుకున్న బన్నీతో పలువురు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Allu Arjun : మరో యాడ్ షూట్ లో బన్నీ.. ఈ సారి ఇంకో కుర్రభామతో.. యాడ్స్ తోనే బన్నీ బిజీ అయిపోతున్నాడుగా..

ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి త్వరలో బన్నీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బన్నీతో ఆయన ఓ సాలిడ్ సినిమాను తెరకెక్కించేందుకే ఈ భేటీ జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరి బన్నీతో రోహిత్ శెట్టి మీటింగ్ దేనికోసమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు బీటౌన్ ఎక్స్‌పర్ట్స్.