Bheemla Nayak: భీమ్లాతో బ్రహ్మీ కామెడీ ట్రాక్.. త్రివిక్రమ్ సెంటిమెంట్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ చేస్తుంటారు. హీరోయిన్ తో ఒక హిట్ కొడితే ఆ తర్వాత మరో సినిమాలో కూడా అదే హీరోయిన్ ను రిపీట్ చేసే..

Bheemla Nayak: భీమ్లాతో బ్రహ్మీ కామెడీ ట్రాక్.. త్రివిక్రమ్ సెంటిమెంట్?

Bheemla Nayak

Bheemla Nayak: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ చేస్తుంటారు. హీరోయిన్ తో ఒక హిట్ కొడితే ఆ తర్వాత మరో సినిమాలో కూడా అదే హీరోయిన్ ను రిపీట్ చేసే త్రివిక్రమ్.. సినిమాకో సీనియర్ హీరోయిన్ ను తీసుకొస్తుంటారు. అలాగే బ్రహ్మానందం కామెడీ కూడా త్రివిక్రమ్ సినిమాలో కామన్. దర్శకుడిగా కాకముందే రచయితగానే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలలో త్రివిక్రమ్ కామెడీ ట్రాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు.

Bheemla Nayak: సింగిల్ గా దూసుకొస్తున్న భీమ్లా.. తుఫాన్ తప్పదా?!

ఇక దర్శకుడిగా కూడా త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి, అత్తారింటికి దారేది, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ తెగ నచ్చించేసింది. బ్రహ్మానందం టైమింగ్, త్రివిక్రమ్ రైటింగ్ ప్రేక్షకులను పడీపడీ నవ్విస్తే.. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో బ్రహ్మీ కామెడీ ఉండేలా చూసుకోవడం సెంటిమెంట్ గా మారిపోయింది. ఇది దర్శకుడిగానే కాకుండా.. ఇప్పుడు స్క్రీన్ ప్లే, రచన అందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కూడా కంటిన్యూ చేశారు. భీమ్లా నాయక్ లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఓ రేంజ్ లో ఉంటుందట.

Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

కథా పరంగా చేసిన రీమేక్ మార్పులలో బ్రహ్మానందం కోసం త్రివిక్రమ్ పాత్రను క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్-రానాల మధ్య ఢీ అంటే ఢీ అనేలా సాగే సీరియస్ స్క్రీన్ ప్లే అనంతరం బ్రహ్మీ కామెడీ ప్రేక్షకులను కూల్ చేస్తుందట. దాదాపుగా సినిమా రెండో భాగంలో వచ్చే బ్రహ్మానందం కామెడీ ట్రాక్ మరో క్రేజీ కామెడీ ఎపిసోడ్ గా మారడం ఖాయమని చెప్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయితే కానీ.. ఈ ఫన్ డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవచ్చు.