Budget 2022 : ఈ బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది : మంత్రి నిర్మలా సీతారామన్

2022 బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మాట్లాడుతూ..ఈ బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్ల అమృతకాలానికి పునాది అని వెల్లడించారు.

Budget 2022 : ఈ బడ్జెట్‌ రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి పునాది : మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2022

Budget 2022 : 2022 బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తున్నారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పలు కీలక అంశాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ ప్రసంగిస్తూ..దేశ జీడీపీ గ్రోత్ రేటు 9.27 శాతంగా అంచనా వేస్తున్నామని..తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎకానమీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

రాబోయే 25 ఏళ్ల (అమృత్ కాల్‌) ప్లాన్‌కు ఈ బడ్జెట్ పునాది అని మంత్రి వెల్లడించారు. ఈ అమృతకాల బడ్జెట్‌ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోందని..పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని తెలిపారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందని..గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందని అన్నారు.ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందని ఈ వేగం పెరుగుతోందని..వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు వేశామని తెలిపారు.

కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చక్కగా కొనసాగిందని..ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందని దీంతో కోవిడ్ ను నియంత్రించగలిగామని తెలిపారు.ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందనీ..రానున్న ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ ప్రధాని గతిశక్తి యోజన,సమీకృత అభివృద్ధి,అభివృద్ధి ఆధారిత ఉపాధి- ఉద్యోగ కల్పన పరిశ్రమలకు ఆర్థిక ఊతం
మిస్తుందని..ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని..ఈ ఏడాది బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.