C Kalyan : కొంతమంది సినిమా వాళ్ళ విమర్శలు పట్టించుకోనవసరం లేదు.. ఏపీ ఫైబర్ నెట్ పస్ట్ డే పస్ట్ షోపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన కామెంట్స్..

ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రేక్షకులకు కొత్త సినిమాను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

C Kalyan : కొంతమంది సినిమా వాళ్ళ విమర్శలు పట్టించుకోనవసరం లేదు.. ఏపీ ఫైబర్ నెట్ పస్ట్ డే పస్ట్ షోపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన కామెంట్స్..

C Kalyan comments at AP Fiber Net First Day First Show Launch Event

AP Fiber Net :  ఏపీ సర్కార్ ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ద్వారా ఎంటర్టైన్మెంట్ ని తక్కువ ధరకి ప్రేక్షకులకు అందిస్తామని కొత్త సినిమాని విడుదల రోజే కేవలం రూ.99 కే ఇంటి వద్దనే కూర్చొని చూసేలా పథకం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో(First Day First Show) అంటూ ప్రచారం చేస్తున్నా పలువురు సినిమా వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు. తాజాగా నేడు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా లాంచ్ చేశారు.

ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రేక్షకులకు కొత్త సినిమాను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ఫైబర్ నెట్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాము. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటంబం చూడవచ్చు. 99 రూపాయల రీచార్జ్ 24 గంటలు పని చేస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్ కూడా హాజరయ్యారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ.. అనేక దేశాల్లో పస్ట్ డే పస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఇది ఎంతో ఉపయోగం. పస్ట్ డే పస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. పస్ట్ డే పస్ట్ షో అనేది మంచి ప్రయోగం. దీనివల్ల చిన్న సినిమాలు బతుకుతాయి. దీనిపై కొంతమంది సినిమా వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పస్ట్ డే పస్ట్ షో కార్యక్రమం ద్వారా సీఎం జగన్ గారికి ఎంతో మంచి పేరు వస్తుంది అని అన్నారు.

Sumanth Prabhas : బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ నా ఇన్స్పిరేషన్.. ‘మేము ఫేమస్’ సుమంత్ ప్రభాస్

ఇక ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఇంట్లో చూసే అవకాశం ఉంటుంది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వలన ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కో సారి సినిమాలు విడుదలకు దియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది అని అన్నారు. మరి ఈ కార్యక్రమంపై, వీరు చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.