Vijayawada: కాల్ మనీ దందా.. మళ్ళీ పెరుగుతున్న ఆగడాలు!

ఏపీలో మరోసారి కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడంతో గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చివరికి మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపే వరకు వీరి ఆగడాలు చేరడంతో

Vijayawada: కాల్ మనీ దందా.. మళ్ళీ పెరుగుతున్న ఆగడాలు!

Call Money Traps Threats Again To The Victims

Vijayawada: ఏపీలో మరోసారి కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడంతో గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చివరికి మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపే వరకు వీరి ఆగడాలు చేరడంతో అప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపి అదుపుచేశారు. అయితే ఇప్పుడు మరోసారి కాల్ మనీ దందా రెచ్చిపోతుంది. సెవెన్ సిస్టర్స్ కాల్ మనీ వ్యాపార దందా పేరుతో బెజవాడలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా సెవెన్ సిస్టర్స్ వేధింపులు భరించలేక రోడ్డెక్కిన హిజ్రాలు కరోనాని అడ్డు పెట్టుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ చెల్లించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలివేలు అనే ఓ హిజ్రా సెవెన్ సిస్టర్స్ దగ్గర రూ.3 లక్షల అప్పు తీసుకోగా అందుకు నూటికి 15 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు. అయితే అలివేలు రెండు నెలలు వడ్డీ చెలించలేకపోవటంతో ఇల్లు రాసివ్వాలని సెవెన్ సిస్టర్స్ ఒత్తిడి తెచ్చారు. బాధిత హిజ్రా అలివేలు అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.