acidity drugs : అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొచ్చా!…
వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్స్ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు.

Gas Problems
acidity drugs : పూర్వం రాళ్ళు తిన్నా అరాయించుకునే విధంగా జీర్ణశక్తి ఉండేదని మన పెద్దలు అంటుంటే వింటుండేవాళ్ళం… అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఆహారం తీసుకోవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణ వ్యవస్ధ సరిగా లేకపోవటం వల్ల కడుపులో మంట, వికారం, చిరాకు, తేన్పులు వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంలో రక్తంలో ఆమ్ల,క్షార సమతుల్యతలే…
ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటార్స్ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోందని బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం ద్వారా తేల్చింది.ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు.సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు.
అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఆయుర్వేదపరంగా ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటిన్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది. తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి , కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి, నూనే వంటకాలు మితముగా తీసుకోవాలి.