Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సినిమాపై కేసు నమోదు

సినిమా క్లైమాక్స్ లో పవన్, రానా మధ్య ఉండే ఫైట్ సీన్‌లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను(కుమ్మరి చక్రం) రానా కాలితో తన్ని దానితో పవన్ పై దాడి చేస్తాడు. ఇది తమ వర్గాన్ని.....

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సినిమాపై కేసు నమోదు

Bheemla Nayak

 

Bheemla Nayak :  పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్‌ సినిమా ‘భీమ్లా నాయక్‌’. ఇటీవల ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని కూడా సంపాదించింది. ప్రస్తుతం థియేటర్స్ లో భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. భీమ్లా నాయక్ సినిమాపై కేసు నమోదయింది.

 

భీమ్లా నాయక్‌ సినిమా క్లైమాక్స్ లో పవన్, రానా మధ్య ఉండే ఫైట్ సీన్‌లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను(కుమ్మరి చక్రం) రానా కాలితో తన్ని దానితో పవన్ పై దాడి చేస్తాడు. ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని, దానితో పాటు ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్‌ మానేపల్లి వీవీఎస్‌ఎన్‌ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే ఆ సన్నివేశాలని తొలిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు లో ”ఆ సన్నివేశాలని వెంటనే సినిమా నుంచి తొలిగించి, ఈ సినిమా హీరోలు పవన్‌ కల్యాణ్‌, రానా, దర్శకనిర్మాతలు సాగర్‌ కే చంద్ర, నాగవంశీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా కుమ్మర శాలివాహనులను అవమానపరిచిన పవన్‌ కల్యాణ్‌ కుమ్మర శాలివాహనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.”

Vignesh Shivan : మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా నయనతార నిర్మాణంలో గుజరాతి సినిమా

భీమ్లా నాయక్ సినిమా పై ఫిర్యాదు చేసిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఫైటింగ్‌ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని(సారె) కాలితో తన్ని దానితో పవన్‌పై దాడి చేసినట్లు చూపించారు. మేము కుమ్మరి చక్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం. అలాంటి సారెను కాలితో తన్నినట్లు చూపించడం మమ్మల్ని కించపరచడమే కాదు, కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది” అని అన్నారు.