Viral News: హోంవర్క్ చేయలేదని చిన్నారిని ఎండలో పడుకోబెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..

చిన్నారులు ఇంట్లో హోం వర్క్ చేసేటప్పుడు మారం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించి, భయపెట్టి హోం వర్క్ చేయిస్తుంటారు. మరీ వినకపోతే చిన్నచిన్న శిక్షలు విధిస్తారు. అయితే ఇక్కడ ఓ మాతృమూర్తి తన ఐదేళ్ల బిడ్డ హోం వర్క్ చేయలేదని కఠిన శిక్ష విధించింది.

Viral News: హోంవర్క్ చేయలేదని చిన్నారిని ఎండలో పడుకోబెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..

Five Year Old Baby

Viral News: చిన్నారులు ఇంట్లో హోం వర్క్ చేసేటప్పుడు మారం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించి, భయపెట్టి హోం వర్క్ చేయిస్తుంటారు. మరీ వినకపోతే చిన్నచిన్న శిక్షలు విధిస్తారు. అయితే ఇక్కడ ఓ మాతృమూర్తి తన ఐదేళ్ల బిడ్డ హోం వర్క్ చేయలేదని కఠిన శిక్ష విధించింది. ఎవరూ ఊహించలేని విధంగా చిన్నారి కాళ్లకు, చేతులకు తాళ్లను కట్టి మండుటెండలో ఇంటి డాబాపై పడుకోబెట్టింది. ఎండవేడికి తాళలేక ఆ చిన్నారి కేకలు వేస్తున్నా ఆ తల్లి కనికరించలేదు. స్థానికంగా ఉండే కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అలసు విషయంపై ఆరా తీశారు.

Leopard Safe: హమ్మయ్య బతికిపోయా.. బావిలో పడి ప్రాణాలతో బయటపడ్డ చిరుత.. వీడియో వైరల్

ఢిల్లీలోని ఖజూరీఖాస్ ప్రాంతంలో జూన్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. చిన్నారి హోం వర్క్ చేయలేదని ఆమె తల్లి కఠిన శిక్ష విధించిందని తెలిపారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో కాళ్లకు, చేతులకు తాళ్లను కట్టి మేడపై చిన్నారిని పడుకోబెట్టిందని, పొరుగింటి నుంచి 25 సెకన్ల వీడియో తీసిన మరో మహిళల ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వీడియోను ఓ వ్యక్తి ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషనర్ చీఫ్ స్వాతి మాలీవాల్ లకు ఓ వ్యక్తి ట్యాగ్ చేశారు.

దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఇంటి పైకప్పుపై బాలికను కట్టేసి దారుణంగా శిక్షించిన తల్లిని గుర్తించే పనిలో ఉన్నాం. ఆమె పరిస్థితుపై నిర్ధారించడానికి ఢిల్లీ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. చిన్నారి కుటుంబాన్ని గుర్తించి తగిన చర్యలు చేపట్టాం అంటూ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. అయితే చిన్నారిని కఠినంగా శిక్షించిన తల్లిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.