Caste-based census: బిహార్‌లో కుల గణన.. అఖిల పక్ష సమావేశంలో సీఎం నిర్ణయం

రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Caste-based census: బిహార్‌లో కుల గణన.. అఖిల పక్ష సమావేశంలో సీఎం నిర్ణయం

Caste Based Census

Caste-based census: రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను ముందుగా రాష్ట్ర క్యాబినెట్‌కు పంపుతారు. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత కుల గణన చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

PM Modi: “కిచిడీ వండటం మోదీనే నేర్పించారు”

అఖిల పక్ష సమావేశం తర్వాత సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. త్వరలో కులాల ఆధారంగా జనాభా గణన చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ‘‘జాతి ఆధారిత్ గణన పేరుతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బీజేపీతోపాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలు దీనికి మద్దతిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కచ్చితమైన గడువును నిర్దేశించుకుంటాం. అన్ని మతాలు, కులాల వారిని పరిగిణనలోకి తీసుకుంటాం. అర్హులైన వాళ్లందరి అభివృద్ధి కోసమే కుల గణన చేపడుతున్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అవసరమైన నిధులు అందిస్తుంది’’ అన్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు.

Oka Padakam Prakaram: మాస్ రాజా చేతుల మీదుగా ఒక పథకం ప్రకారం టీజర్

నవంబర్‌లోగా కుల గణన ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంటే, బిహార్‌లోని బీజేపీ మాత్రం దీనికి మద్దతివ్వడం విశేషం. ఎప్పట్నుంచో పలు రాష్ట్రాలు కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనలను కేంద్ర తిరస్కరిస్తూ వస్తోంది.