PM Modi: “కిచిడీ వండటం మోదీనే నేర్పించారు”

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిమ్లా పర్యటన అనంతరం.. స్థానిక బీజేపీ లీడర్ భార్య తనకు మోదీ కిచిడీ వండటం నేర్పించారంటూ గుర్తు చేసుకున్నారు. 90లలో హిమాచల్ ప్రదేశ్ యూనిట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో 'సాబు దానా కిచిడీ' వండటం నేర్పారని చెప్తున్నారు.

PM Modi: “కిచిడీ వండటం మోదీనే నేర్పించారు”

Pm Modi In Gujarat

 

 

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిమ్లా పర్యటన అనంతరం.. స్థానిక బీజేపీ లీడర్ భార్య తనకు మోదీ కిచిడీ వండటం నేర్పించారంటూ గుర్తు చేసుకున్నారు. 90లలో హిమాచల్ ప్రదేశ్ యూనిట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ‘సాబు దానా కిచిడీ’ వండటం నేర్పారని చెప్తున్నారు.

లీకల్ బీజేపీ లీడర్ దీపక్ శర్మ భార్య సీమా శర్మ.. 1997వ సంవత్సరం నవరాత్రులు జరుగుతున్న సమయంలో కిచిడీ వండానని చెప్పారు. కాకపోతే అనుకున్నంత రుచిగా లేదని.. అప్పుడు మోదీనే ఎలా చేయాలో నేర్పారని వివరించారు.

మంగళవారం సిమ్లా పర్యటనకు వెళ్లిన మోదీ.. సీఎం జై రామ్ ఠాకూర్ ను దీపక్ శర్మ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రిడ్జ్ మైదాన్ లో జరుగుతున్న సమావేశంలో అదే విషయాన్ని ప్రస్తావించారు. సాధారణ కార్యకర్తలతోనూ మోదీకి ఉండే సంబంధాల గురించి చెప్తూ.. ఇదొక ఉదాహరణగా అభివర్ణించారు. ఇప్పటికీ దీపక్ శర్మ జూఖూ టెంపుల్ కు కాలినడకనే వెళ్తానని తెలిపారు.

Read Also: “నేను ప్రధాన మంత్రిని కాదు.. 130కోట్ల మందికి ప్రధాన సేవకుడ్ని మాత్రమే”

సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్‌లో నామినేటెడ్ కౌన్సిలర్ శర్మను సంప్రదించినప్పుడు, మోడీ తనను గుర్తుంచుకోవడం తెలిసి ఆనందానికి అవధులు లేవని అన్నారు. .

1997-98లో రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు మోదీ, దీపక్ వైషవ్ భోజ్నాల్య సిమ్లాలోని మిడిల్ బజార్‌లో ఉన్న నివాసానికి తరచూ వెళ్లేవారని ఆయన మీడియాకు వివరించారు.

నవరాత్రుల సమయంలో మోదీ ఏడాదికి రెండుసార్లు ఉపవాస దీక్షలు చేసేవారని శర్మ చెప్పారు. మార్చిలో మొదటి నవరాత్రులలో, మోడీ కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు, దసరా ముందు రెండో సమయంలో పండ్లు మొదలైనవాటిని తీసుకునేవారని వివరించారు.

1997లో రెండో నవరాత్రుల సందర్భంగా మోదీ ‘సాబు దానా ఖిచ్డీ (సాగో)’ తినేందుకు సుముఖత వ్యక్తం చేశారని, ఆయన భార్య సీమా శర్మ తనకు వండి పెట్టారని, అయితే ఆశించిన స్థాయిలో లేదని శర్మ గుర్తు చేసుకున్నారు.

మోడీ అప్పుడు పీటర్‌హాఫ్ హోటల్‌లో బస చేశారు. ఖచ్చితమైన ‘సాబు దానా ఖిచ్డీ’ ఎలా ఉడికించాలో నేర్పించడంతో అప్పటి నుంచి ‘సాబు దానా కిచిడీ’ వండినప్పుడల్లా మోదీ నేర్పిన విధంగానే వండుతున్నా’’ అని సీమా భర్తను గుర్తు చేసుకున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.