PM Modi: “నేను ప్రధాన మంత్రిని కాదు.. 130కోట్ల మందికి ప్రధాన సేవకుడ్ని మాత్రమే”

భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్‌ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశారు.

PM Modi: “నేను ప్రధాన మంత్రిని కాదు.. 130కోట్ల మందికి ప్రధాన సేవకుడ్ని మాత్రమే”

Pm Modi In Gujarat

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్‌ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశారు.

మోదీ హయాంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర రాజధానుల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ రోడ్ షోలో భాగంగా మాట్లాడిన మోదీ.. “గత ఎనిమిదేళ్లుగా నన్ను నేనెప్పుడూ ప్రధానిగా పరిగణించలేదు. పీఎంగా డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు మాత్రమే అలా చూసుకున్నా. నేను ఎప్పటికీ ప్రధానిని కాను. కేవలం 130కోట్ల మంది ప్రజల ప్రధాన సేవకుడ్ని మాత్రమే. వాళ్లే నా సర్వస్వం. నా జీవితం ఉంది వాళ్ల కోసమే”

Read Also: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే

“ఆత్కీ లట్కీ భట్కీ పథకాలు, బంధుప్రీతి, కుంభకోణాల గురించి చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించే మాట్లాడుకుంటున్నారు. భారతదేశంలోని స్టార్టప్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశం వ్యాపారశైలి గురించే మాట్లాడుతుంది’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఎన్నికైన ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేలా సమ్మేళన్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ఫీడ్‌బ్యాక్‌ను పొందే ప్రయత్నమే ఇది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ ఉదయం 09:45 గంటలకు ప్రారంభమైంది.

సమ్మేళనం సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ కేంద్ర ప్రభుత్వంలోని తొమ్మిది మంత్రిత్వ శాఖలు/విభాగాల వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.