Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే

ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే

Kedarnath

Kedarnath: ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో యాత్ర పొడవునా వ్యర్థాలు పెరుగుతుండటంపై స్పందించారు. ‘‘దేశంలో పవిత్రమైన ఛార్‌ధామ్ యాత్ర ప్రస్తుతం సాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఈ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటున్నారు. వాళ్ల సంతోషాన్ని పంచుకుంటున్నారు.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

అయితే, చాలా మంది యాత్రికులు మార్గమధ్యంలో వ్యర్థాలు, చెత్తను పెంచుతున్నారు. ఈ విషయంపై చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మనం ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తే.. అక్కడ ఇలాంటి చెత్త కనిపించడం సరికాదు. కొంతమంది భక్తులు ఈ చెత్త ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మరికొందరు తాము ఉన్న చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.