CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలు.. టైం అండ్ ప్లేస్ తెలుసా?

చాలా గ్యాప్ తరువాత సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మళ్ళీ తిరిగి వచ్చింది. నేటి (ఫిబ్రవరి 18) నుంచి ఈ లీగ్ మ్యాచ్స్ మొదలు కాబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ లు ఎప్పుడు, ఎక్కడ జరగబోతున్నాయి, ఎక్కడ చూడవచ్చు అనేది తెలుసా?

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలు.. టైం అండ్ ప్లేస్ తెలుసా?

celebrate cricket league date time and place

CCL 2023 : సినిమా, క్రికెట్.. మన దేశంలో ఈ రెండు ప్లాట్‌ఫార్మ్ లకు ఉన్న పాపులారిటీ మరే రంగానికి ఉండదు. ఈ ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్స్ కి, యాక్టర్స్ కి కోట్లమందిలో అభిమానులు ఉంటారు. సినిమా రిలీజ్ ఉన్నా, క్రికెట్ మ్యాచ్ ఉన్నా అభిమానులు తమ పనులను పక్కన పెట్టి మరి క్రికెట్, సినిమా చూడడానికి ఓటు వేస్తారు. అలాంటిది ఆ రెండు ఒకే ప్లాట్‌ఫార్మ్ పై కనిపిస్తే అది ప్రేక్షకులకు కన్నుల పండగ అనే చెప్పాలి. సినిమాలో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టే హీరోలు.. బ్యాట్ పట్టుకొనే క్రికెట్ గ్రౌండ్ లో దిగి సిక్స్ లు కొడుతుంటే అభిమానులకు పూనకాలు రావాల్సిందే.

CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఏ టీంకి కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు వారియర్స్ కెప్టెన్ ?

సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ అంటూ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ టైం నుంచే ఈ లీగ్ మ్యాచ్స్ జరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ మ్యాచ్స్ లో అందరు పాల్గొనే వాళ్ళు. అయితే కొన్నాళ్లుగా ఈ కార్యక్రమం జరగడం లేదు. ఇప్పుడు మళ్ళీ సెలెబ్రెటీస్ అంతా గ్రౌండ్ లో దుమ్ము దూలపడానికి సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ లు నేటి (ఫిబ్రవరి 18) నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ క్రికెట్ లీగ్ లో మొత్తం ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ ఆడబోతున్నాయి. ఈ లీగ్ మ్యాచ్ లు లక్నో, జైపూర్, బెంగుళూరు, జోధ్ పూర్, త్రివేండ్రంలో జరగనున్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు మాత్రం హైదరాబాద్ లో జరగనున్నాయి.

ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మ్యాచ్ లు ఉండనున్నాయి. మొదటి మ్యాచ్ తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి బెంగళూరులో జరగబోతుంది. ఈ మ్యాచ్ అవ్వగానే 7 గంటలకు చెన్నై రైనోస్, కర్ణాటక బుల్లడోజర్స్ మధ్య అదే స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. మరి మొదటి మ్యాచ్ ని తెలుగు స్టార్స్ సొంతం చేసుకుంటారా? కేరళ స్టార్స్ గెలుస్తారా? అనేది చూడాలి. అలాగే మిగిలిన మ్యాచ్ లు ఎక్కడ జరగబోతున్నాయి, ఎక్కడ చూడవచ్చు అనే వివరాలు కింద గమనించండి.