Amit Shah: సినిమా చూసి భార్యను ఆటపట్టించిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ వీక్షించారు. న్యూ ఢిల్లీలో బుధవారం సాయంత్రం సినిమా చూసిన అనంతరం నటీనటులను, సిబ్బందిని పీరియడ్ డ్రామా బాగుందంటూ ప్రశంసించారు.

Amit Shah: సినిమా చూసి భార్యను ఆటపట్టించిన అమిత్ షా

Amit Sha

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ వీక్షించారు. న్యూ ఢిల్లీలో బుధవారం సాయంత్రం సినిమా చూసిన అనంతరం నటీనటులను, సిబ్బందిని పీరియడ్ డ్రామా బాగుందంటూ ప్రశంసించారు. చరిత్ర చదువుకున్న విద్యార్థిగా భారతదేశ సాంస్కృతిక యుద్ధాలను వర్ణించే ఈ చిత్రాన్ని చూసి ఆనందించడమే కాకుండా భారతీయులపై దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు.

13 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తున్నానని అమిత్ షా తెలిపారు. సినిమాలోని నటీనటుల గురించి వివరిస్తూ ప్రశంసించడంతో క్లాప్స్ వర్షం కురిసింది.

మహిళలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడం అనే భారతీయ సంస్కృతిని ఈ చిత్రం స్పష్టంగా వివరించిందని అభిప్రాయపడ్డారు. మధ్యయుగ కాలాలలో స్త్రీలు అనుభవించిన రాజకీయ అధికారం, ఎంచుకునే స్వేచ్ఛ గురించి ఈ చిత్రంలో బాగా చూపించారని ప్రశంసించారు.

Read Also: ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి అమిత్ షా

మాట్లాడటం ముగించుకుని అమిత్ షా బయటకు వెళ్లిపోయేందుకు నడుస్తుండగా.. అతని భార్య సోనాల్ ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయారు. వెంటనే షా.. సినిమాటిక్ వాయీస్ లో ” చలియే హుకుం ” అని సినిమాలోని పాత్రల డైలాగ్ ఒకటి విసిరారు.

ప్రేక్షకులతో పాటు సోనాల్ కూడా నవ్వుతుండగా.. కుమారుడు జే షా ఆమెను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. అలా కుటుంబ సమేతంగా సినిమా చూసి చాణక్య ఫిల్మ్ హాల్ నుండి బయలుదేరారు షా ఫ్యామిలీ.