Friendship Day 2023 : క్యాన్సర్‌తో బాధపడుతున్న స్నేహితురాలికి అండగా నిలబడిన బాల్య స్నేహితులు .. ఇదే కదా అసలైన స్నేహమంటే

కష్టంలో ఉన్న స్నేహితురాలి కోసం బాల్య స్నేహితులు అంతా కలిసి వచ్చాయి. ఆమెకు భరోసా ఇచ్చారు. మేమున్నామనే ధైర్యాన్నిచ్చారు. గురుకుల స్కూల్లో చదువుకున్న పాత స్నేహితులంతా కలిసి తన చిన్ననాటి స్నేహితురాలకి ధైర్యం చెప్పారు. కష్టంలోన్నప్పుడు అండగా ఉంటనే కదా స్నేమమంటే అనేలా చేశారు.

Friendship Day 2023 : క్యాన్సర్‌తో బాధపడుతున్న స్నేహితురాలికి అండగా నిలబడిన బాల్య స్నేహితులు .. ఇదే కదా అసలైన స్నేహమంటే

Girls Gurukula school Childhood friends Meet

friendship Day 2023 : స్నేహం అంటే కాసేపు పోసుకోలు కబుర్లు చెప్పుకుని బాయ్ అని చెప్పేసి వెళ్లిపోవటం కాదు..ఎప్పుడో కలుసుకుని కలిసి నాలుగు రకాల ఐటెమ్స్ తినేసి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోవటం కాదు. స్నేహితులు ఎక్కడున్నా..వారు ఎలా ఉన్నారు..? సంతోషంగా ఉన్నారా..? లేదా తెలుసుకోవాలి.కష్టంలో ఉంటే ఆదుకోవాలి. అనారోగ్యం బారిన పడితే అండగా ఉండాలి. స్నేహితుల కోపాన్ని..లోపాన్ని భరించాలి..మంచీ చెడులు చెప్పాలి. స్నేహంలో పొడగడ్తలు కంటే సూచనలే ఎక్కువుండాలి..అటువంటిదే స్వచ్ఛమైన స్నేహం. కష్టంలో ఉన్న స్నేహితులను ఆదుకోవటమే అసలైన స్నేహం.

చదువుకునే సయమంలో ఏర్పడిన స్నేహాలు రాను రాను విడిపోతాయి. ఉద్యోగాలు..ఉపాధుల రీత్యా ఎక్కడెక్కడే స్థిరపడతారు. ఈ క్రమంలో వారిని కలుసుకోవటం తగ్గిపోతుంది. కనీసం ఫోనుల్లో మాట్లాడుకోవటం కూడా తగ్గిపోతుంది. కానీ ఇటీవల సోషల్ మీడియా వచ్చాక పాత స్నేహితులు తిరిగి కలుసుకుంటున్నారు. వాట్సాప్ లో గ్రూపులు ఏర్పడి పాత స్నేహితుల చిరునామాలు..వారి కాంటాక్ట్ నంబర్లు తెలుసుకుని మరీ కలుస్తున్నారు. అలా కలుసుకున్నవారు వారి కష్టసుఖాలను కలబోసుకుంటున్నారు.

Artist Mohan : కమల్ హాసన్ స్నేహితుడు కన్నుమూత.. కమల్‌తో కలిసి నటించి.. చివరకు రోడ్లపై భిక్షాటన చేస్తూ మరణం..

కానీ అలా కలసి విడిపోవటమే కాదు స్నేహితులు కష్టంలో ఉంటే ఆదుకునేలా..వారికి తాము ఉన్నామనే భరోసా ఇచ్చేలా ఉండాలి. అదే అసలైన స్నేహం అంటే ..అటువంటి కొంతమంది స్నేహితులు క్యాన్సర్ బారిన పడిన తమ పాత స్నేహితురాలి కోసం కదలివచ్చి అండగా నిలబడిన ఘటన తెలంగాణ(Telangana)లోని హనుమకొండ (Hanumakonda )జిల్లాలో చోటుచేసుకుంది. ఎప్పుడో 1993లో కలిసి చదువుకున్నవారంతో ఓ స్నేహితురాలు క్యాన్సర్ తో బాదపడుతోందని తెలిసి అంతా ఒకచోట చేశారు. ఆమెకు మానసిక స్థైర్యాన్ని కల్పించారు.

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి (Hasanparthi)ఎర్రగట్టగుట్ట సమీప బాలికల గురుకుల స్కూల్ (Erragattagutta Girls Gurukula school)లో 1993లో 10 తరగతి చదివారు. ఈ బ్యాచ్‌ లో జయప్రద అనే మహిళ వరంగల్‌ జిల్లా గురిజాల స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె క్యాన్సర్‌ బారిన పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మానసికంగా కృంగిపోయారు. ఈ విషయంతో ఆమె బాల్యస్నేహితులకు తెలిసింది. అంతే అంతా ఆమె వద్ద వాలిపోయారు. అందరు కలిసి ఆమెకు ధైర్యం చెప్పారు. నీకు మేమున్నాం అనే భరోసాఇచ్చారు.

  Female-Male Friendships : ఆడవారు, మగవారు నిజంగా మంచి స్నేహితులుగా ఉండగలరా?

అలా ఆయా ప్రాంతాల్లో స్థిరపడివారంతా దాదాపు 30 మంది బుధవారం (జులై 2,2023) హనుమకొండ విద్యుత్తునగర్‌లో జయప్రద నివసిస్తున్న ఇంటికి వచ్చారు. ఆమె పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ఆరోజు అంతా స్నేహితురాలితో కలిసి ఉన్నారు. మేమున్నాం నీకేం కాదు అనే ధైర్యాన్ని నూరిపోసారు. పాత స్నేహితులు తనకోసం రావటంతో జయప్రద చాలా చాలా సంతోషించారు. ఈ సంతోషం నాకు మరింత జీవించే శక్తినిస్తుంది అంటూ స్నేహితులతో చెప్పారు.ఆ స్నేహితుల గ్రూపులో రచయిత్రులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు కూడా ఉన్నారు.