Viral Video: అర్ధరాత్రి దాటాక కారుతో స్టంట్.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

మద్యం దుకాణం ముందు కారుతో అర్ధరాత్రి దాటాక స్టంట్లు చేస్తున్నారు కొందరు యువకులు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కారు తీసుకుని వేగంగా దూసుకువచ్చి బ్రేక్ వేసి స్టంట్ చేయబోయాడు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరిని ఢీ కొట్టింది కారు. దీంతో 50 ఏళ్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

Viral Video: అర్ధరాత్రి దాటాక కారుతో స్టంట్.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

Viral Video: మద్యం దుకాణం ముందు కారుతో అర్ధరాత్రి దాటాక స్టంట్లు చేస్తున్నారు కొందరు యువకులు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కారు తీసుకుని వేగంగా దూసుకువచ్చి బ్రేక్ వేసి స్టంట్ చేయబోయాడు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరిని ఢీ కొట్టింది కారు. దీంతో 50 ఏళ్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారు ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడున్న వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కారులోని వ్యక్తి స్టంట్లు చేసే ఉద్దేశంతో కారును వేగంగా తీసుకువస్తున్న సమయంలో అక్కడున్న వారంతా భయంతో పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారు.

అయితే, కారు బ్రేక్ వేస్తూ వచ్చి అక్కడున్న వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..