China Divorce: విడాకులు కోరే జంటలకు ఝలక్ ఇస్తున్న చైనా కోర్టు..అటువంటి కారణాలు చెల్లవంటున్న ధర్మాసనం

విడాకులు కోరే జంటకు ఝలక్ ఇస్తోంది చైనా కోర్టు. అటువంటి రీజన్స్ తో వస్తే విడాకుల దరఖాస్తులు స్వీకరించమని తేల్చి చెబుతోంది.

China Divorce: విడాకులు కోరే జంటలకు ఝలక్ ఇస్తున్న చైనా కోర్టు..అటువంటి కారణాలు చెల్లవంటున్న ధర్మాసనం

Rajasthan Crime (1)

China Divorce : చైనా విడాకుల కోసం కోర్టుకెళితే వారికి విడాకులు రావటం కష్టమేననే సంకేతాలిస్తోంది కోర్టు. ఎందుకంటే విడాకులు కోరే దంపతులు చెప్పే కారణాన్ని బట్టి విడాకులు ఇస్తామంటోంది ధర్మాసనం. ఎవరైనా దంపతులు ‘తాము మోసపోయామని కారణం చెబితే వారికి విడాకులు ఇచ్చేదిలేదని స్పష్టంచేస్తోంది కోర్టు. దీంతో జనాలు మండిపడుతున్నారు.తమకు కలిసి జీవించటం ఇష్టం లేదు..విడాకులు ఇవ్వమని కోరితే కోర్టుకు అభ్యంతరమేంటీ? అని ప్రశ్నిస్తున్నారు. తమ జీవిత భాగస్వామి తమను మోసం చేసింది అంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న జంటకు ఝలక్ ఇస్తోంది కోర్టు. ఈ కారణంతో విడాకుల కోసం అప్లై చేయడం అనుమతించమంటూ చైనాలోని ఓ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై చైనాలో పెద్ద దుమారం చెలరేగింది.

Dog Birthday: కుక్క బర్త్ డే కోసం రూ.11 లక్షలు వెచ్చించి 520 డ్రోన్లతో సెలబ్రేషన్

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కోర్టు.. మోసం అనే రీజన్‌తో విడాకులకు దరఖాస్తు చేస్తే స్వీకరించమని తేల్చి చెప్పింది. కోర్టు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే.. అసలు కోర్టుకు అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. సహజీవనాన్ని మోసంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది. సహజీవనం అంటే పెళ్లయిన వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ఎవరితోనైనా నిరంతరం జీవించడమేనని పేర్కొంది. విడాకుల దాఖలు చేయడానికి వ్యభిచారాన్ని ఒక కారణంగా పరిగణించలేమని కోర్టు స్పష్టంచేసింది.

విడాకుల చట్టంపై చైనాలో విమర్శలు..
గత సంవత్సరం చైనా విడాకుల చట్టంలో కొన్ని మార్పులు చేసి ఆమోదించింది. దీంతో జంటలు విడాకులు తీసుకోవడం కష్టంగా మారింది. మారిన ఈ కొత్త రూల్స్ ప్రకారం..దంపతులు విడాకులు తీసుకోవాలంటే…నెలరోజులు ‘కూలింగ్ ఆఫ్’ పీరియడ్‌లో ఉండాలి. వారు విడాకులు నెలరోజులు ఉన్న జంటను కలిపి ఉంచడానికి అసలు కారణం వారు విడిపోకుండా ఉంచడానికే. వారి వైవాహిక బంధాన్ని కొనసాగించడానికి ఏదైనా సందర్భంగా కలుగుతుందనే ఉద్ధేశం. వారు అర్థం చేసుకోవటానికి వీలు కల్పించటం. అలా నెల రోజుల తర్వాత కూడా వారు మధ్య సర్ధుబాటు కుదరకపోతే..అప్పుడు మళ్లీ విడాకులకు దరఖాస్తు చేసుకోవాలి.

Guinness Record: జ‌డ‌తో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించిన భారత్ మహిళ

ఈ విడాకులు తీసుకునే ప్రక్రియలో 30 రోజులలోపు జీవిత భాగస్వామి ఇష్టపడకపోతే..విడాకుల కోసం చేసుకున్న దరఖాస్తు రద్దు చేయబడుతుంది. దీంతో డైవర్స్ ఆలస్యం కావడమేకాదు.. లాయర్లకు కూడా ఫీజులు అధికంగా చెల్లించాల్సి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చైనా ప్రభుత్వం ఈ కొత్త విడాకుల చట్టాన్ని ఆమోదించిన తర్వాత.. ప్రజలు తమ వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు.