china-india: మా మ‌ధ్య‌ అమెరికా అగ్నికి ఆజ్యం పోస్తోంది: చైనా

అమెరికాపై చైనా మండిపడింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద (తూర్పు ల‌ద్దాఖ్ స‌మీపంలో) చైనా అభివృద్ధి చేసుకుంటోన్న మౌలిక వ‌స‌తులు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని అమెరికా ఆర్మీకి చెందిన‌ ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్ చార్లెస్ ఎ.ఫ్లిన్‌ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ఝావో లిజియాన్ గురువారం స్పందించారు.

china-india: మా మ‌ధ్య‌ అమెరికా అగ్నికి ఆజ్యం పోస్తోంది: చైనా

china-india: అమెరికాపై చైనా మండిపడింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద (తూర్పు ల‌ద్దాఖ్ స‌మీపంలో) చైనా అభివృద్ధి చేసుకుంటోన్న మౌలిక వ‌స‌తులు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని అమెరికా ఆర్మీకి చెందిన‌ ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్ చార్లెస్ ఎ.ఫ్లిన్‌ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ఝావో లిజియాన్ గురువారం స్పందించారు.

Rajya Sabha Polls: ఓటు వేసేందుకు న‌వాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌కు అవ‌కాశం ఇవ్వ‌ని కోర్టు

”కొంద‌రు అమెరికా అధికారులు వేలెత్తి చూపుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇది హేయ‌మైన‌ చ‌ర్య. ప్రాంతీయ భద్ర‌త‌కు, శాంతి, సుస్థిర‌త‌కు వారు సాయ‌ప‌డ‌తార‌ని ఆశిస్తున్నాం. తూర్పు ల‌ద్దాఖ్ వ‌ద్ద ఇరు వైపులా ప‌రిస్థితులు నిల‌క‌డ‌గా ఉన్నాయి. భార‌త్‌-చైనా మ‌ధ్య ఉన్న విభేదాల‌ను చ‌ర్చ‌ల‌తో ప‌రిష్కించుకునే సామ‌ర్థ్యం మా ఇరు దేశాల‌కు ఉంది” అని ఝావో లిజియాన్ అన్నారు. కాగా, భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్ చార్లెస్ ఎ.ఫ్లిన్ తాజాగా మాట్లాడుతూ… చైనా తీరు ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ను పెంచేలా ఉంద‌ని చెప్పారు. పాంగాంగ్ స‌రస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణం చేప‌డుతోంది. అయితే, స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆ నిర్మాణాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ఎ.ఫ్లిన్ ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలోనే దీనిపై చైనా ఘాటుగా స్పందించింది.