Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?

ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్...

Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?

Chiranjeevi Congrats Major Movie Team

Major: ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, హీరో అడివి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా టేకింగ్ మొదలుకొని, నటీనటుల పర్ఫార్మెన్స్‌ల వరకు అన్నింటికీ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మేజర్ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు.

Major : అడివిశేష్ లాంటి వాళ్ళు మరింతమంది సినిమాల్లోకి రావాలి.. మేజర్ సినిమాపై పవన్ ప్రశంసలు..

అయితే తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. మేజర్ సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మేజర్’ ఒక సినిమా కాదని.. అది ఒక ఎమోషన్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు.. ఇలాంటి ప్రాజెక్టుకు వెనకుండి నడిపించిన మహేష్ బాబుకు కృతజ్ఞతలు.. మేజర్ చిత్రటీమ్‌కు శుభాకాంక్షలు’’ అంటూ చిరు తాజాగా ట్వీట్ చేశాడు.

Major: ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మేజర్!

ఇక చిరంజీవి చేసిన ట్వీట్‌కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపాడు. అటు హీరో అడివి శేష్ కూడా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. తాము ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో అభినందనలు తెలుపుతుంటే, తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లుగా ఉందని అడివి శేష్ అన్నాడు. ఇక ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రల్లో నటించారు.