CM Jagan : కార్పొరేట్‌‌కు ధీటుగా..కొత్త వైద్య కళాశాలల నిర్మాణం

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధికారులు.. వాటి వివరాలను సీఎంకు వివరించారు.

CM Jagan : కార్పొరేట్‌‌కు ధీటుగా..కొత్త వైద్య కళాశాలల నిర్మాణం

Cm Jagan Review On Covid 19 Situation

AP Covid 19 Situation : కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధికారులు.. వాటి వివరాలను సీఎంకు వివరించారు.

కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడుతున్నామని.. ప్రమాణాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ ఆదేశించారు. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో ఎమర్జెన్సీ ప్లాన్స్ కూడా సమర్థవంతంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి. అన్ని అంశాలతో సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏపీలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, కర్ఫ్యూ సడలింపులు అంశాలపై చర్చ జరిగింది. ఇవాళ్టి నుంచి తూర్పుగోదావరి జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ సమయం సడలింపు అమలులోకి వచ్చింది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఉంటుంది.

ఆదివారం జరిగిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సక్సెస్‌ చేసిన సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. ఒకే రోజు 13 లక్షల 59 వేల మందికి టీకా వేసి రికార్డు సృష్టించడం మంచి పరిణామన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే టీకా వేసే సమర్థత ఉందని నిరూపించారని ప్రశంసించారు. రాష్ట్రంలో మంచి యంత్రాంగం ఉందన్నారు జగన్‌.