CM KCR : దేశం దారి తప్పుతోంది.. సెట్ రైట్ చేస్తా – సీఎం కేసీఆర్

ఇలాంటి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు..

CM KCR : దేశం దారి తప్పుతోంది.. సెట్ రైట్ చేస్తా – సీఎం కేసీఆర్

Cm Kcr

Mallanna Sagar Project : భారతదేశం దారి తప్పుతోంది…దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది.. దేశం చెడిపోవద్దు కాబట్టి…ముందుకు వెళ్లాలి.. దుర్మార్గమైన, అసహ్యం పుట్టించే పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కర్నాటక రాష్ట్రంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలిసిందేనన్నారు. కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళుతాయన్నారు. ప్రశాంత వాతావరణంటే సంపద, పరిశ్రమలు, భూ సంపదలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్ లో మతకల్లోలాలు వస్తే.. పరిశ్రమలు వస్తాయా ? అని ప్రశ్నించారు.

Read More : CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. చాలా సంతోషంగా ఉందన్న సీఎం కేసీఆర్

ఇలాంటి క్యాన్సర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు వరకు దేశాన్ని సెటిల్ చేస్తానని తెలిపారు. హైదరాబాద్ లో లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నట్లు, అంతర్జాతీయ విమానాలు హైదరాబాద్ కు వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథం దూసుకపోతోందన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా ? అంటే అది తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు.

Read More :ప్రారంభానికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ సిద్ధం

జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా.. ఇటీవలే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్పీసీ అధినేత శరద్ పవార్ లతో సమావేశం జరిపారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా తాను త్వరలోనే కలువబోతున్నట్లు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆన్ని పార్టీలను ఒకదగ్గరకు చేర్చే విధంగా తాను ప్రయత్నిస్తానన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రశంసించారు. కేసీఆర్ పోరాటానికి మద్దతు తెలియచేశారు.

Read More : Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

ఇక మల్లన్న సాగర్ విషయానికి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు నీటి సరఫరాతో పాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ రిజర్వాయర్‌ కీలకం కానుంది. భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌కు చేరిన గోదావరి జలాల్ని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. దీంతో తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా మల్లన్నసాగర్‌పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌తో మేలు జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం మల్లన్నసాగర్‌. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు.