CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. తెలంగాణకు కరువు రాదన్న సీఎం కేసీఆర్

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ టన్నెల్‌ దగ్గర పూజలు నిర్వహించారు కేసీఆర్‌. ఆ తర్వాత పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్‌చేసి.. గోదావరి జలాల్ని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. అనంతరం గోదారమ్మకు..

CM KCR : మల్లన్న సాగర్ జాతికి అంకితం.. తెలంగాణకు కరువు రాదన్న సీఎం కేసీఆర్

Mallanna

CM KCR Inaugurates Mallanna Sagar : కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. చాలా సంతోషం..నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడిన మల్లన్న సాగర్ ను ప్రారంభించుకోవడం చారిత్రకమైన ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. ఈ కల సాకారం కావడానికి, మహాయజ్ఞంలో పని చేసిన వారికి అభినందనలు తెలియచేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 14 రాష్ట్రాల నుంచి 58 వేల మంది కార్మికులు పని చేస్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారనే విషయాన్ని గుర్తు చేశారు. ఉన్నతంగా ఆలోచించి..ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తాను సూచించడం జరిగిందన్నారు. దాదాపు 600కు పైగా కేసులు వేస్తూ..అడ్డం పడ్డారన్నారు. 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్ అయిన ఇంజినీర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.

Read More : ప్రారంభానికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ సిద్ధం

ఇంజినీర్లు భయపడలేదు : –
కేసులు పెడుతున్నా.. ఇంజినీర్లు భయపడకుండా ఇక్కడ పని చేయడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజే చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. 600 ఎకరాల భూమి.. చుట్టూ నీళ్లు ఉండి…మధ్యలో ఐలాండ్ పరిస్థితి ఉంటుందన్నారు. హైదరాబాద్ కు శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టు రూపొందిందన్నారు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకొనే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో మంది సహాయం చేసిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. మల్లన్న సాగర్ వద్ద రూ. 100 కోట్లతో ఇరిగేషన్ కాంప్లెక్స్ వెంటనే ప్రారంభించాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Read More : Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

గోదావరి నీళ్లు తెచ్చి కొమరవెల్లి పాదాలు: –
సినిమా షూటింగ్ లు.. ఇక్కడకు వచ్చే టూరిస్టులతో మల్లన్న సాగర్ అలరాడుతుందని తెలిపారు. ఇక్కడ కలర్ ఫౌంటేన్ ఏర్పాటు చేయాలని, సింగపూర్ నుంచి టూరిస్టులు ఇక్కడకు వచ్చే విధంగా చేయాలని మరోసారి సూచించారు. కేవలం ఓట్ల కోసమే తమ ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇవ్వడం లేదని, గతంలో ఉన్న దుస్థితి పోవాలనే పద్ధతితో పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను చూసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారని, దేశానికే మార్గదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. దేశం మొత్తం కరవు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కరవు రాదని తెలిపారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతామని ఆనాడు చెప్పామని, గోదావరి జిలాలతో అభిషేకం చేయబోతున్నామన్నారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Read More : కొండంత సంబరం : కొండ పోచమ్మ ప్రాజెక్టు..ఆ పేరు ఎలా వచ్చిందంటే ? 

టన్నెల్ దగ్గర సీఎం కేసీఆర్ పూజలు : –
అంతకంటే ముందు…మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ టన్నెల్‌ దగ్గర పూజలు నిర్వహించారు కేసీఆర్‌. ఆ తర్వాత పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్‌చేసి.. గోదావరి జలాల్ని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. అనంతరం గోదారమ్మకు సారె సమర్పించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి మల్లన్న సాగర్‌ను పరిశీలించారు కేసీఆర్‌. మల్లన్నసాగర్‌.. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వరప్రదాయినిగా భావిస్తున్నారు. భారీ ఎత్తున గోదావరి జలాల్ని ఒడిసి పట్టడమే కాదు.. ఆయకట్టుకు సమానంగా సాగునీటి పంపిణీ జరగాలన్నా, డిమాండు-సరఫరాకు మధ్య వ్యత్యాసాన్ని భారీగా తగ్గించాలన్నా, చివరకు ప్రాజెక్టులో ఎక్కడ కొరత, సమస్య ఏర్పడినా వ్యవస్థ కుప్పకూలకుండా ఆదుకోవాలన్నా అన్నింటికీ ఒకే తారక మంత్రంగా మల్లన్నసాగర్‌ కనిపిస్తోంది. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో మల్లన్నసాగర్‌ను మదర్‌ రిజర్వాయర్‌గా అభివర్ణించారు.