Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు.

Mallanna Sagar : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు

Mallanna Sagar

Mallanna Sagar : తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద ప్రాజెక్ట్ మల్లన్నసాగర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నదిలేని చోట ప్రాజెక్ట్ నిర్మాణం చేశామన్నారు. ఇక్కడి నుండి 10 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నదికే కొత్తనడక నేర్పారని మంత్రి చెప్పారు.

90 మీటర్లు ప్రవహించే నదిని 557 మీటర్ల ఎత్తుకు తేవడం జరిగిందన్నారు. భూసేకరణ సమయంలో ప్రాజెక్ట్ కోసం కాదు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ కి కొమరవెళ్లి మల్లన్న సాగర్ పేరు పెట్టుకున్నామని చెప్పారు. 20 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 16 టీఎంసీలు పరిశ్రమలకు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. నిర్వాసితుల త్యాగాలు గొప్పవని హరీష్ అన్నారు. సింగూరు, నిజాంసాగర్, గాంపూర్ కు మల్లన్న సాగర్ నుండి నీరు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నామన్నారు.

తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చాలా కష్టపడ్డారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. కేసీఆర్ తపన మొత్తం ప్రజల కోసమే అన్నారు. బీజేపీ నాయకులు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రక్తం పారించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీళ్లు పారిస్తే, బీజేపీ నాయకులు రక్తం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Minister Harish Rao : మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు ఇచ్చాం : మంత్రి హరీష్ రావు

సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండాకాల ఉండేదని హరీశ్ వాపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా వానాకాలం లాగానే కనబడుతోందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.

బీజేపీ నాయకులు టీఆర్ఎస్ మీద కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి జాతీయ ఓదా తీసుకొస్తే… దండలు వేస్తామని హరీశ్ అన్నారు. పాలమూరు ఘోష ఎలా తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తే, మీదేమో పాకిస్తాన్ గోస అని మండిపడ్డారు. మల్లన్నసాగర్ సగం తెలంగాణకు నీరును అందిస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ వందేళ్ల ముందుకు ఆలోచన చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని మంత్రి హరీశ్ వెల్లడించారు.

Telangana CM KCR To Inaugurate Mallanna Sagar Reservoir

Telangana CM KCR To Inaugurate Mallanna Sagar Reservoir

ఈ నెల 23న సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ మల్లన్న సాగరే అతి పెద్దది. సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య జలాశయంను నిర్మించారు. అత్యంత ఎత్తున నిర్మించిన జలాశయంగా మల్లన్నసాగర్ ప్రత్యేకతను సంతరించుకుంది. డ్యామ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మల్లన్నసాగర్‌ ను ప్రారంభానికి అధికారులు సర్వ సన్నద్ధం చేశారు.

CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన కొమరవెళ్లి మల్లన్న సాగర్ జలాశయంతో వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ-స్టేజ్‌ 1, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15,71,050 ఎకరాలు ఈ రిజర్వాయర్‌ కిందికి రానున్నాయి. రిజర్వాయర్‌ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా, 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పొడవుతో మత్తడిని ఏర్పాటుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని మల్లన్నసాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు ఈ జలాశయానికి అనుబంధంగా పంప్‌హౌస్ నిర్మించారు. ఈ పంపుహౌస్ దగ్గర సీఎం కేసీఆర్ మీట నొక్కి గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నీటిపారుదల రంగం చరిత్రలోనే సమతల ప్రాంతంలో 50టీఎంసీల నీటి నిల్వ సామర్ధంతో కూడిన మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది.