Minister Harish Rao : మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు ఇచ్చాం : మంత్రి హరీష్ రావు

మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.

Minister Harish Rao : మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు ఇచ్చాం : మంత్రి హరీష్ రావు

Harish Rao

Minister Harish Rao : సాగు నీటి కోసం సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు ప్రారంభించడం సంతోషకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మన గురించి ఎవరు ఆలోచించలేదని విమర్శించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సోమవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణ్ ఖేడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని, ప్రసంగించారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరిచ్చామని తెలిపారు.

మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు. ‘బోరంచకు పిల్లనీయోద్దు… హద్నూరకు ఎద్దు నీయోద్దు’ అనే సామెత ఉండేది…ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. నారాయణఖేడ్ దశ దిశ మారిందని తెలిపారు. 54 గ్రామపంచాయతీలను తండాలను‌ చేశామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.

CM KCR : అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి : సీఎం కేసీఆర్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కువ అప నమ్మకం ఉండేదన్నారు. చావు అంచువరకు వెళ్ళి తెలంగాణ సాధించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సమస్య వస్తుందని అన్నారని గుర్తు చేశారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పారు.

గురుకుల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఏడేళ్ళలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గోదావరి జలాలను తెస్తానని హామీ ఇచ్చా….ఇచ్చిన మాట ప్రకారం 4 వేల కోట్లతో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందేలా చూడాలని తెలిపారు.

CM KCR : ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి : సీఎం కేసీఆర్

గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకంటే ఆంధోల్ లో ఎక్కువ సాగవుతోందని చెప్పారు. ఆంధోల్ కు గతంలో ఫారెన్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపారు. వారం రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ 100 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మీ అందరి దీవెనలతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

70 ఏళ్ళలో దేశంలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. కుల,మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విభజించి పాలించే రాజకీయాలపై చర్చ జరగాలన్నారు. రైతు బంధు, రైతు భీమా ఎలా ఇస్తున్నారని మహారాష్ట్ర సిఎం అడిగారని తెలిపారు. జాతీయ రాజకీయాలకు వెళ్ళి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. అమెరికా ఎలా అభివృద్ధి చెందిందో అలాగా చేసుకుందామని పేర్కొన్నారు. తాను పోరాటానికి బయలుదేరానని తెలిపారు.