CM KCR : అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి : సీఎం కేసీఆర్

దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.

CM KCR : అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి : సీఎం కేసీఆర్

Cm Kcr (1)

CM KCR addressed the public meeting : అమెరికా కన్నా గొప్పగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణలా.. బంగారు భారతదేశాన్ని తయారు చేసుకోవాలన్నారు. రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందాలని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి పనులు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నారు. దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో రాజకీయం ఉండాల్సినట్టుగా లేదన్నారు. దేశ రాజకీయాల్లో కూడా మనం కీలక పాత్ర పోషించాలన్నారు. ‘నేను పోరాటానికి బయల్దేరాను.. మీ దీవెలు కావాలి’ అన్నారు.

నారాయణ్ ఖేడ్ లో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపనం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఏడాదిన్నరలోగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశామని తెలిపారు. 10 రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సంగారెడ్డికి రూ.50కోట్లు, జహీరాబాద్ కు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ రేపే జీవో జారీ చేస్తామని అన్నారు.

CM KCR : దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్

సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. నిధులు వృధా చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేయండి అని అన్నారు. పంచాయతీలకు ప్రతీ నెలా నిధులు పంపిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని 699 పంచాయతీలకు రూ.20లక్షలు చొప్పున రూ.140 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో రాజకీయం ఉండాల్సినట్లుగా లేదన్నారు. ఏ రకమైన తెలంగాన ఉండాలో ప్రతీ ఒక్కరు చర్చ జరపాలని తెలిపారు. అన్ని కులాలు, వర్గాలు, మతాలు మంచిగా ఉండాలన్నారు. ఒక నారాయణ్ ఖేడ్ కే రూ.200 కోట్ల రైతుబంధు అందుతోందన్నారు.