TRS MLC candidates : ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితా కొలిక్కివచ్చింది. ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, టి.రవీందర్ రావులను ఫైనల్ చేశారు.

TRS MLC candidates : ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్

Trs Mlc

three MLC candidates finalized : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితా కొలిక్కివచ్చింది. ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, టి.రవీందర్ రావు పేర్లను ఫైనల్ చేశారు. వారికి ప్రగతి భవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక టికెట్ కన్ఫామ్ అయిన వారిలో కడియం శ్రీహరి…వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి..నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా టికెట్ కన్ఫామ్ చేసుకున్నారు.

అదేవిధంగా టి.రవీందర్ రావు కూడా వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ను కన్ఫామ్ చేసుకున్నారు. మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లు సాయంత్రం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, వీరంతా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆరు ఎమెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయనుంది. అందులో భాగంగా తొలి విడతగా ముగ్గురి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరో ముగ్గురి పేర్లకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది.

Supreme Court : ఢిల్లీ వాయుకాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్.. కీలక నేతలు మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ లను సంప్రదించిన అనంతరం పార్టీని క్షేత్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లే నాయకులతోపాటు సామాజిక సమీకరణాలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో మూడు పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది.

మరో మూడు స్థానాలకు సంబంధించి ఎల్.రమణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్ సీ.కోటి రెడ్డి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం ఉంది. అయితే తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా మధుసూదనాచారి వంటి నేతల పేర్లకు ప్రాధాన్యత దక్కవచ్చని అంటున్నారు. ఆ ముగ్గురిలో ఎవరెవరిని అదృష్టం వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

TDP Complaint : మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇవాళ సాయంత్రం పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తరపున ఆరుగురు అభ్యర్థులు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కావడంతో కచ్చితంగా అందరూ మంగళవారం నామినేషన్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.