TDP Complaint : మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

వైసీపీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు.

TDP Complaint : మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

Tdp

TDP complaint on YCP: వైసీపీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు. వైసీపీ నేతలు పలు చోట్ల దొంగ ఒట్లు వేయిస్తున్నారని, అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు అశోక్ బాబు, బోండా ఉమా, బోడె ప్రసాద్.. ఎస్ఈసీ నీలం సాహ్నీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ నేతలు ఈసీకి వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వైసీపీకి డబ్బు, అధికార పిచ్చి పట్టిందని విమర్శించారు.

ఎన్నికల్లో ఎక్కడా కోడ్ ఆఫ్ కండక్టు అమలు కావడం లేదని చాలా సార్లు ఫిర్యాదు చేశామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శలు చేశారు. ఇవాళ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దొంగ ఓట్లు వేయిస్తుందని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ఇతర నియోజకవర్గాల నుంచి డ్వాక్రా, వెలుగు మహిళలను తీసుకొచ్చారని పేర్కొన్నారు.

UP Assembly Elections : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు.. ఒంటరిగా పోటీ చేయనున్న ప్రధాన పార్టీలు

వందలాది వాహనాల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆరోపించారు. ఎస్ఈసీ ఫిర్యాదులు పట్టించుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిచారు. చిన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టడానికి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాలిబన్ల పాలనను తలపించేలా నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దేనికీ భయపడకుండా చివరి నిమిషం వరకూ పోరాడతామని పేర్కొన్నారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. పలు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగఒట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. కుప్పం, సహా పలు మున్సిపాల్టీల్లో దొంగ ఒట్లు వేయిస్తున్నారని పేర్కొన్నారు. దొంగ ఓట్లపై సాక్షాధారాలతో సహా ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  బోగస్ ఓట్లు వేసేందుకు వచ్చే వారిని అరెస్టు చేయాలని కోరాం, డీఎస్పీని బదిలీ చేయాలని కోరినా ప్రయోజనం లేదన్నారు.

Raging : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ బదులుగా వైసీపీ నిర్వహిస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎలా తెబితే అలా పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఒటు వేయకపోతే సంక్షేమ పథకాలు తీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎస్ఈసీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.