CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక కసరత్తులో ఉన్నారు. ప్రగతి భవన్ వేదికగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్ తో పాటు, మంత్రి హరీశ్ రావు ద్వారా పలువురిని....

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు

Kcr

Updated On : November 14, 2021 / 9:54 PM IST

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక కసరత్తులో ఉన్నారు. ప్రగతి భవన్ వేదికగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్ తో పాటు, మంత్రి హరీశ్ రావు ద్వారా పలువురిని తీసుకోవాలంటూ విజ్ఞప్తులు అందాయి. అదే కాకుండా పలువురు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

నవంబర్ 16వ తేదీన ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ లోగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఏడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న సీఎం.. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి కోసం పరిశీలిస్తున్నారు.

 

……………………………….: చైతూ ట్వీట్.. జుట్టు పీక్కున్న నెటిజన్లు!