Ajwain : జలుబు,దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలకు వాముతో!

వాము ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచటంతోపాటుగా కడుపులో నులినొప్పి, గ్యాసు,అజీర్తి విరేచనాలు, నీళ్ళవిరేచనాలు,. పళ్ళకు, చిగుళ్ల సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

Ajwain : జలుబు,దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలకు వాముతో!

Ajwain

Ajwain : వామును భారతీయులు ఔషధినిగా బావిస్తారు. అందుకు వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు. ఇందులో అనేక ఔషదగుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. వాము ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచటంతోపాటుగా కడుపులో నులినొప్పి, గ్యాసు,అజీర్తి విరేచనాలు, నీళ్ళవిరేచనాలు,. పళ్ళకు, చిగుళ్ల సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

వాముతో జలుబు,దగ్గు, ఊపరితిత్తులతో పాటుగా ఇతర సమస్యల నివారణకు ;

జలుబు: పావు టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపును ఒక కప్పులో తీసుకోండి. అందులో ఒక టీ కప్పు వేడి నీళ్ళు కలపండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, జలుబువల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.

ఉబ్బసం, బ్రాంకైటిస్: ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా కట్టాలి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. సుఖోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

దగ్గు: అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి అరకప్పు వేడి నీళ్లను కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.

కఫం: అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.

ముక్కుదిబ్బడ, తల నొప్పి: 200నుంచి 250 గ్రాముల వామును పెనంమీద వేడి చేసి, మెత్తని పల్చని నూలుగుడ్డలో పోసి మూటగాకట్టి పెనంమీద వేడి చేసి బాగా గాఢంగా వాసన పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి వంటివి తగ్గుతాయి.

ఊపిరితిత్తులు శుభ్రం: రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.