Elon Musk: ఆఫీసుకు వస్తారా.. కంపెనీ వదిలేస్తారా? ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్

టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.

Elon Musk: ఆఫీసుకు వస్తారా.. కంపెనీ వదిలేస్తారా? ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్

Elon Musk

Elon Musk: టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం. కోవిడ్ నేపథ్యంలో చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.

New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం

టెస్లా ఉద్యోగులుల్లో కూడా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీరిలో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు. వాళ్లను ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఎలన్ మస్క్ ఎప్పట్నుంచో కోరుతున్నారు. అయితే, ఇంకా చాలా మంది ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అసలు వాళ్లు ఆఫీసుకు వస్తారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టుగా ఎలన్ మస్క్ రంగంలోకి దిగాడు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌కు గట్టి వార్నింగ్ ఇస్తూ నేరుగా మెయిల్స్ పంపుతున్నాడు. ‘‘రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకపై అంగీకరించను. ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడున్నా సరే టెస్లా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందే. అది కూడా బ్రాంచ్ ఆఫీసులకు కాదు.. హెడ్ ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలి. ఆఫీసులో కనీసం వారానికి 40 గంటలైనా పనిచేయాలి. ఇది ఫ్యాక్టరీ వర్కర్స్ చేసే పని గంటలకంటే తక్కువ. ఒకవేళ ఆఫీసుకు వచ్చి పని చేయడం ఇష్టం లేకుంటే కంపెనీ విడిచి వెళ్లిపోవచ్చు’’ అని ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో మస్క్ పేర్కొన్నాడు.

home guards’ salary: హోం గార్డుల జీతం తొమ్మిది వేలేనా: సుప్రీం కోర్టు ప్రశ్న

మరోవైపు ఆఫీసుకు వచ్చి పనిచేయకుండా ఎవరికైనా మినహాయింపు ఇవ్వాల్సి వస్తే తానే నేరుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని, అలా అనుమతించిన వాళ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడంతో టెస్లాతోపాటు చాలా కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీసుకే వచ్చి పనిచేయాలి అని కోరుతున్నాయి.