home guards’ salary: హోం గార్డుల జీతం తొమ్మిది వేలేనా: సుప్రీం కోర్టు ప్రశ్న

ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది.

home guards’ salary: హోం గార్డుల జీతం తొమ్మిది వేలేనా: సుప్రీం కోర్టు ప్రశ్న

The Supreme Court

home guards’ salary: ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది. హోంగార్డులకు కనీసం రోజుకు రూ.533 చొప్పున వేతనం ఇవ్వాలని ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ ఎమ్.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఒడిశా ప్రభుత్వానికి ఈ విషయంలో సూచనలు చేసింది. ‘‘నెలకు తొమ్మిది వేల రూపాయలు మాత్రమే జీతం ఇవ్వడమంటే దోపీడీతో సమానమే.

Population Control Bill: జనాభా నియంత్రణకు త్వరలో చట్టం: కేంద్ర మంత్రి

తొమ్మిది వేల జీతంతో హోంగార్డు ఫ్యామిలీ ఎలా బతకగలుగుతుంది. పోలీసులతో సమానంగా పని చేస్తుంటే జీతం మాత్రం హోంగార్డులకు తక్కువగా ఎందుకు ఉంటుంది. కొంతమంది హోంగార్డులు పదిహేనేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ తక్కువ వేతనమే అందుతోంది. అదే పోలీసులకైతే ఆరేళ్ల అగ్రిమెంట్ తర్వాత కనీసం రూ.21,700 అందుతోంది. కానీ, హోంగార్డులకు మాత్రం రోజుకు రూ.300 మాత్రమే వస్తోంది. అందుకే ఇంత తక్కువ వేతనం ఇవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకోవాలని మేం ఒడిశా ప్రభుత్వానికి సూచిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణ వచ్చే జూలైకు వాయిదా పడింది.