Population Control Bill: జనాభా నియంత్రణకు త్వరలో చట్టం: కేంద్ర మంత్రి
దేశంలో జనాభా నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడారు.

Prahlad Singh Patel
Population Control Bill: దేశంలో జనాభా నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖా మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జనాభా నియంత్రణ చట్టం గురించి స్పందించారు. త్వరలోనే జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టం రాబోతుందని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు.
Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లని బంధించడం న్యాయమా: కేజ్రీవాల్
జనాభా నియంత్రణ బిల్లు గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2019లో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ముసాయిదా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కూడా ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును 2020లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ బిల్లులు రాజ్యసభ పరిశీలనలోనే ఉన్నాయి. అయితే, తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో జనాభా నియంత్రణ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్లు స్పష్టమైంది.