Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా.. ఉపరితల ఆవర్తనం కూడా ఉందని తెలిపింది.

Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Rains

Updated On : September 21, 2021 / 7:10 PM IST

Rains : తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా.. ఉపరితల ఆవర్తనం కూడా ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణతోపాటు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాకు వర్ష సూచన ఉందని వివరించారు. దక్షిణ గాంగటక్‌ నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది.

Read More : viral pic:కరోనా టీకా తీసుకోనందుకు..రోడ్డుపై నిలబడి పిజ్జా తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు..

దీని ప్రభావంతో రాగాల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షానికి పాతబస్తీలోని లొట్టట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నదులను తలపించాయి. వర్షాలు నీటి ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి.

Read More : Revanth Reddy: కేటీఆర్‌పై ఆరోపణలు చేయొద్దు.. రేవంత్ రెడ్డిని ఆదేశించిన కోర్టు

బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.