Udaipur Chintan Shivir : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్.. ట్రైన్‌లో ఉదయ్‌పూర్‌కు రాహుల్‌..

Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ నిర్వహించనుంది.

Udaipur Chintan Shivir : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్.. ట్రైన్‌లో ఉదయ్‌పూర్‌కు రాహుల్‌..

Congress' 3 Day Brainstorming In Udaipur From May 13 For New Roadmap

Udaipur Chintan Shivir : వరుస ఎన్నికల్లో పరాజయాల నుంచి తేరుకుని విజయాల దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటుకాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ చింతన్‌ శివిర్‌ నిర్వహించనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలంతా ఉదయపూర్‌ చేరుకున్నారు. కాంగ్రస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 75 మంది కీలక నేతలు ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు రైలులో ప్రయాణించారు. సోనియాగాంధీ నేతృత్వంలో జరిగే చింతన్‌ శివిర్‌కు దేశ వ్యాప్తంగా 430మంది కాంగ్రెస్‌ నేతలు హాజరు అవుతున్నారు.

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై ఆందోళన, భవిష్యత్‌ కార్యాచరణతోపాటు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత చింతన్‌ శివిర్‌ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.

Congress' 3 Day Brainstorming In Udaipur From May 13 For New Roadmap (1)

Congress’ 3 Day Brainstorming In Udaipur From May 13 For New Roadmap 

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవస్థాగత బలోపేతం, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించే అవకాశం ఉంది. ఆర్థిక, సామాజిక అంశాలపై విస్తృతంగా కూడా చర్చించనున్నారు. రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా సోనియాగాంధీ ఆహ్వానం మేరకు నేతలంతా కాంగ్రెస్ చింతన్ శివిర్ సదస్సుకు హాజరుకానున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌ ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Read Also : Rahul Gandhi: భారత్‌ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు