Madhya Pradesh: సామూహిక వివాహాలు చేస్తే చేశారు.. కానీ పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులేంటి?

ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన మహిళల్లో ఒకరు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి జీవించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ "నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అందుకే వివాహాల తుది జాబితా నుంచి నా పేరు తొలగించి ఉంటారు. అయితే, అధికారులు నాకు స్పష్టమైన కారణం చెప్పలేదు" అని పేర్కొంది.

Madhya Pradesh: సామూహిక వివాహాలు చేస్తే చేశారు.. కానీ పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులేంటి?

mass marriage in Madhya Pradesh

Madhya Pradesh: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికల కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం తీవ్ర విమర్శల మధ్య చిక్కుకుంది. వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు గుప్పుమనడంతో విపక్షాలు సహా ఇతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది రాజకీయంగా రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. ఇలాంటి పరీక్షలు చేయడమేంటని, దీనికి ఆదేశాలు ఇచ్చిందెవరని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.

Khammam Politics: ఖమ్మంకు హరీష్ రావు, రేవంత్ రెడ్డి.. జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్..

219 మంది బాలికలకు ప్రెగ్నెన్సీ టెస్టులు చేయగా.. అందులో ఐదుగురు పాజిటివ్ అని తేలిందట. దీంతో వారి పెళ్లి ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఒక బాధితురాలు ఈ విషయాన్ని బహిరంగ పర్చడంతో ఇది నిజమేనని తేలింది. ‘ముఖ్యమంత్రి కన్యా వివాహం/వివాహ యోజన’ కింద, దిండోరిలోని గడ్సరాయ్ ప్రాంతంలో సామూహిక వివాహం జరిగింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన మహిళల్లో ఒకరు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి జీవించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ “నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అందుకే వివాహాల తుది జాబితా నుంచి నా పేరు తొలగించి ఉంటారు. అయితే, అధికారులు నాకు స్పష్టమైన కారణం చెప్పలేదు” అని పేర్కొంది.

Amritpal Singh: యోధుడిలా లొగిపోయాడు, గర్వంగా ఉంది.. అమృతపాల్ సింగ్ అరెస్టుపై తల్లిదండ్రుల రియాక్షన్ ఇది

అంతే.. రాష్ట్రంలో ఇది పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక దిండోరి జిల్లాలోని బచ్చడ్‌గావ్ గ్రామ సర్పంచ్ మేదాని మరవి మాట్లాడుతూ.. ఇలాంటి పరీక్షలు గతంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు ఇలాంటి పరీక్షలు చేస్తూ తమ కుటుంబాల ముందు ఆడబిడ్డలను అవమానించడమేనని అన్నారు. డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ రమేష్ మరావి మాట్లాడుతూ “మేము కేవలం ఆరోగ్య సంబంధిత పరీక్షలు మాత్రమే చేస్తాము. బాలికలకు ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వస్తే అది ఆరోగ్య శాఖ నివేదిక ఆధారంగా సామాజిక న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంటుంది” అని చెప్పారు.

Maharashtra Politics: మహారాష్ట్రలో పాచికలు మారుస్తున్న శరద్ పవార్.. విపక్షాలకు దూరంగా, బీజేపీకి దగ్గరగా అడుగులు

దీనిపై మాజీ ముఖ్యమంత్రి కమల్‭నాథ్ స్పందిస్తూ ఈ వార్త నిజమో కాదో ముఖ్యమంత్రి నుంచి తెలుసుకోవాలని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన సమాజంలోని ఆడబిడ్డలకు గౌరవం లేదా? శివరాజ్ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే విషయంలో మధ్యప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయమైన, ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను” అని ట్విట్టర్ ద్వారా స్పందించారు.