Delhi Covid : ఢిల్లీలో కరోనా భయం.. మళ్లీ నిబంధనలు

టాక్సీలు, ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించేటప్పుడు కూడా మాస్క్‌ను తప్పక ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మినహాయింపు వర్తింపజేయడం కుదరదని వెల్లడించింది. మార్కెట్, బస్, మెట్రోల్లో...

Delhi Covid : ఢిల్లీలో కరోనా భయం.. మళ్లీ నిబంధనలు

Delhi Corona

Corona Cases In Delhi : భారతదేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గత కొద్ది రోజుల క్రితం తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండంతో వైరస్ పీడ విరిగిపోయిందని అనుకున్నారంతా. కానీ..మళ్లీ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. కొవిడ్ థర్డ్ వేవ్ నుంచి బయపడి కాస్తా ఊపిరిపీల్చుకున్నామో లేదో మళ్లీ నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కరోనా కేసులు తీవ్రత చూస్తుంటే.. నాల్గో వేవ్ ముప్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో గత 24 గంటల్లో 2,527 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరో 33 మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీలోనే 1042 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల 253 యాక్టీవ్ కేసులుండగా.. 4.71 శాతానికి పాజిటివిటి రేటు చేరింది.

Read More : Corona Rising in India: ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్: పరిస్థితిపై డీడీఎంఏ సమీక్ష

ఢిల్లీలో ఇప్పటి వరకు 18,72,699 కేసులు నమోదయ్యాయి. 26 వేల 164 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. కరోనా కేసులు అధికమౌతుండడంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయ్యింది. మళ్లీ నిబంధనలు విధించింది. డీడీఎంఏ (DDMA) సిఫార్సులను ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కరోనా తగ్గుదలతో… గతంలో విధించిన నిబంధనలకు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022, ఏప్రిల్ 23వ తేదీ శనివారం నుంచి ఢిల్లీలో మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నారు.

Read More : India Covid-19 : దేశంలో కొవిడ్ నాల్గో వేవ్ ముప్పు.. వరుసగా 4వరోజు పెరిగిన కరోనా కేసులు

టాక్సీలు, ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించేటప్పుడు కూడా మాస్క్‌ను తప్పక ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మినహాయింపు వర్తింపజేయడం కుదరదని వెల్లడించింది. మార్కెట్, బస్, మెట్రోల్లో మాస్క్ కంపల్సరీగా ధరించాలని, వ్యక్తిగత వాహనంలో ఒక్కరే ప్రయాణిస్తే మాస్క్ అవసరం లేదని అధికారులు తెలిపారు. సొంత వాహనంలో అయినా… ఒకరికి మించి ప్రయాణిస్తే అందరూ మాస్క్ తప్పక ధరించాలని మరోసారి సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.