Corona Delhi : ఢిల్లీ జైలులో 114, తీహార్ జైలులో 76 మందికి కరోనా

మండోలి జైలులో 24 మంది ఖైదీలు, 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోహిణి జైలులో ఆరుగురు సిబ్బందికి వైరస్ సోకింది.

Corona Delhi : ఢిల్లీ జైలులో 114, తీహార్ జైలులో 76 మందికి కరోనా

Delhi

Corona for 114 in Delhi jail : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. అయినా ఢిల్లీ జైళ్లల్లో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీ జైలులో 66 మంది ఖైదీలు, 48 మందికి సిబ్బందికి కరోనా సోకింది. తీహార్ జైలులో 42 మంది ఖైదీలు, 34 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మండోలి జైలులో 24 మంది ఖైదీలు, 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోహిణి జైలులో ఆరుగురు సిబ్బందికి వైరస్ సోకింది.

భారత్ లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 277 మంది వైరస్ సోకి మరణించారు. దేశంలో ప్రస్తుతం 8,21,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటివరకు 4,84,213 మంది మృతి చెందారు. మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు 4,461కు చేరాయి. ఒమిక్రాన్ నుంచి 1,711 మంది బాధితులు కోలుకున్నారు.

Jagadish Reddy : తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రాజ్‌నాథ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు కొవిడ్ బారినపడగా.. తాజాగా మరో కేంద్రమంత్రి అజయ్‌ భట్‌ కి మహమ్మారి సోకింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.