కరోనా ఎఫెక్ట్ : ఇప్పుడు ఈ వస్తువులను మళ్లీ తాకాలంటే వణికిపోతున్నారంతా!

  • Published By: srihari ,Published On : June 17, 2020 / 04:33 PM IST
కరోనా ఎఫెక్ట్ : ఇప్పుడు ఈ వస్తువులను మళ్లీ తాకాలంటే వణికిపోతున్నారంతా!

కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా వినాశనం సృష్టిస్తోంది. వేలాది మందిని చంపి లక్షలాది మందికి సోకుతోంది. సామాజిక దూరం అనే మాట మూములైపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పోల్ కూడా ప్రజలలో ప్రవర్తనలో ఆసక్తికరమైన మార్పును వెల్లడించింది.

హ్యాండ్‌రైల్స్ , స్తంభాలు :
హ్యాండ్‌రెయిల్స్.. మురికి ప్రదేశాలలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ భయంకరమైన హ్యాండ్‌రెయిల్స్‌లో శ్లేష్మం, మలం, రక్తం, మూత్రం జాడలు కూడా ఒక అధ్యయనంలో బయటపడ్డాయి. సహజంగానే, ఇప్పుడు 290 మందిలో 56.9 శాతం మంది ఎస్కలేటర్ హ్యాండ్‌రెయిల్స్ నుంచి బయటపడాలని యోచిస్తున్నట్లు TOI పోల్ కనిపెట్టింది. మెట్రో, బస్సు స్తంభాలను తాకాలంటేనే వణుకు పుట్టిస్తోంది. 
covid-effect

జిమ్ సామగ్రి :
ఈ పోల్‌లో 22.4 శాతం మంది జిమ్ పరికరాలను తాకడానికి భయపడిపోతున్నారని తేలింది. వర్కౌట్ చేసే ప్రదేశంలో చెమట ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రాంతంలో అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు. అందుకే.. ప్రభుత్వాలు ఇప్పటికీ లాక్ డౌన్ జాబితా నుంచి జిమ్‌లను అనుమతించలేదు. 
covid-effect

ఎలివేటర్ బటన్లు :
మీరు ఎత్తైన భవనంలో ఉంటే.. మీరు తప్పకుండా ఎలివేటర్‌ను ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే అన్ని మెట్లు పైకి ఎక్కి వెళ్లలేరు కదా.. తప్పని పరిస్థితుల్లో లిఫ్ట్ వాడకం తప్పదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీనికి చాలానే పరిష్కారాలు ఉన్నాయి. బటన్లను నొక్కడానికి మీరు కీలు, కర్రలు లేదా మోచేయి వంటి వస్తువులను ఉపయోగించవచ్చు. 
covid-effect

దయచేసి.. మేకప్ టెస్టింగ్ చేయొద్దు :
ఏదైనా సౌందర్య ఉత్పత్తులు లేదా స్ప్రేలు షాపింగ్ చేసే ముందు వాటిని టెస్టింగ్ చేయడం అందరికి అలవాటు. టెస్టింగ్ చేసిన తర్వాతే ఆ ప్రొడక్టు బాగుంటే కొనేందుకు ఇష్ట పడతారు. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌లు, బాక్టీరియాకు సంతానోత్పత్తి కేంద్రంగా మారాయి. ఎవరైనా దాన్ని ఓసారి టెస్టింగ్ చేసినట్టు భావిస్తే కొనేందుకు భయపడిపోతారు. మీరు ఒకదాన్ని పొందడం అదృష్టంగా భావిస్తే.. అది మరొకరు ఉపయోగించనిది అని నిర్ధారించుకోండి.
covid-effect

సహోద్యోగి ల్యాప్‌టాప్ / డెస్క్‌టాప్ :
పక్క వారి స్మార్ట్ ఫోన్లు, సహోద్యోగి ల్యాప్‌టాప్ / డెస్క్‌టాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు రెండుసార్లు ఆలోచించని రోజులు పోయాయి. కంప్యూటర్ కీబోర్డులు టాయిలెట్ సీట్ల కన్నా మురికిగా ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. ToI పోల్‌లో కూడా నో-నో జాబితాలోనూ ల్యాప్‌టాప్‌లు / డెస్క్‌టాప్‌ వాడేందుకు అయిష్టత చూపినట్టు తేలింది. 
covid-effect